వైయస్‌ జగన్‌ ధైర్యశాలి..

పేదలను ఆదుకోవాలనే తపనతో పనిచేస్తున్నారు

వైయస్‌ జగన్‌ వ్యక్తిత్వాన్ని ప్రతిపక్షాలు గ్రహించాలి 

వైయస్‌ జగన్‌కు పెద్దలంటే అత్యంత గౌరవం

గూడూరు వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే వరప్రసాద్‌

అమరావతి:సీఎం వైయస్‌ జగన్‌ లాంటి ధైర్యశాలిని ఎక్కడ చూడలేదని గూడూరు వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే వరప్రసాద్‌ అన్నారు.మంగళవారం ఆయన అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ వైయస్‌ జగన్‌ పట్టదల,క్రమశిక్షణ గలిగిన వ్యక్తి అని కొనియాడారు.రాజకీయాల్లో అనుభవం కలిగిన నాయకులు కూడా వైయస్‌ జగన్‌ను చూసి నేర్చుకోవాలనే విధంగా ఆయన పరిణితి చెందారన్నారు.దివంగత మహానేత వైయస్‌ఆర్‌ ఏవిధంగా ప్రజాసేవా చేసి  ప్రజల హృదయాల్లో నిలిచిపోయారో అదేవిధంగా  వైయస్‌ జగన్‌ కూడా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలనే తపనతో పనిచేస్తున్నారన్నారు. వైయస్‌ జగన్‌పై టీడీపీ నేతలు ఆయనపై అనేక రకాలుగా దుష్ఫ్రచారాలు చేశారన్నారు.  ఐదు సంవత్సరాలుగా ఆయనతో ఎంపీగా ఉన్నప్పుడు ఒకసారి కూడా నన్ను ఏకవచనంతో ఉచ్ఛరించలేదన్నారు.పెద్దలంటే వైయస్‌ జగన్‌కు ఎంతో గౌరవమన్నారు.వైయస్‌ జగన్‌ సంస్కారం కలిగిన  వ్యక్తి అని సభా ముఖంగా తెలిపారు. వైయస్‌ జగన్‌ వ్యక్తిత్వాన్ని  ప్రతిపక్షాలు తెలుసుకోవాలని సూచించారు.సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు అద్భుతంగా ఉన్నాయన్నారు.వైయస్‌ జగన్‌..ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనారీటీల పట్ల చిత్తశుద్ధితో ఉన్నారన్నారు.

 

తాజా వీడియోలు

Back to Top