మహిళలపై దాడులు నీతిబాహ్య చర్య 

వైయస్‌ఆర్‌సీపీ ఇన్‌చార్జ్‌ తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి
 

అనంతపురం: చంద్రబాబు చెబుతున్న పసుపు–కుంకుమ కార్యక్రమాన్ని మహిళలు నమ్మడం లేదని గ్రహించిన టీడీపీ నేతలు జీర్ణించుకోలేక వారిపై దాడులకు దిగుతున్నారని వైయస్‌ఆర్‌సీపీ రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తిప్రకాశ్‌రెడ్డి మండిపడ్డారు. ఇలాంటివి నీతిబాష్య చర్యలని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో టీడీపీకి ఓట్లు వేయాలని బలవంతపు ప్రమాణం చేయించుకుంటున్నారని ఆయన ఖండించారు. ప్రమాణం చేయని మహిళలపై స్వయంగా రాళ్లు రువ్విన మంత్రి పరిటాల సునీత సోదరుడిని అరెస్టు చేయాలని ఆయన డిమాండు చేశారు.

చంద్రబాబు పంపిణీ చేస్తున్న చెక్కులను మహిళలు నమ్మడం లేదన్నారు. ప్రలోభపెట్టేందుకే ఇలా చేస్తున్నారని మహిళలు విమర్శిస్తున్నారని చెప్పారు. మహిళలు చెక్కులు తీసుకున్నా ఎలాంటి స్పందన లేదన్నారు. దీంతో ప్రెస్టేషన్‌తో టీడీపీ నేతలు దాడులు చేస్తున్నారన్నారు. మహిళలపై దాడి చేసిన వీడియోలో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయని తెలిపారు. నిజంగా ప్రజాస్వామ్యం ఉందా అని చర్చించుకుంటున్నారన్నారు. చెక్కులను రాజకీయం చేస్తూ, పుస్తెలపై ప్రమాణం చేయించుకోవడం నీతిబాహ్యమైన చర్యగా అభివర్ణించారు. సెంటిమెంట్‌ ఉపయోగించి ఓట్లు పొందాలని చూస్తున్నారని, ఈ ప్రభుత్వానికి అంతిమ ఘడియలు సమీపించాయని ఆయన హెచ్చరించారు.

Back to Top