జేసీ సోదరుల అరాచకాలు మీతిమిరుతున్నాయి..

సిఐని పరామర్శించిన వైయస్‌ఆర్‌సీపీ నేత పెద్దారెడ్డి

అనంతపురంః జేసీ అనుచరుల దాడిలో గాయపడ్డ సీఐని వైయస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి పరామర్శించారు.తాడిపత్రిలో జేసీ సోదరుల అరాచకాలు మితిమీరుతున్నాయన్నారు.ప్రభుత్వం అండతోనే జేసీ బ్రదర్స్‌ బరి తెగిస్తున్నారన్నారు.జేసీ సోదరులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.తాడిపత్రి పరిస్థితి బిహార్‌ కన్నా దారుణంగా తయారవుతుందన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు.పోలీసు,రెవెన్యూ వ్యవస్థలు జేసీ సోదరుల కన్నుసన్నల్లో నడుస్తున్నాయన్నారు.గతంలో ప్రభోనంద ఆశ్రమంపై దాడులకు పాల్పడిన పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారన్నారు. జేసీ సోదరులు ఆగడాలు రోజురోజుకు పెరుగుపోతున్నాయన్నారు.

Back to Top