చంద్రబాబు డ్రామాలు బీసీలు నమ్మరు..

వైయస్‌ఆర్‌సీపీ నేత కారుమూరి నాగేశ్వరరావు

పశ్చిమగోదావరి: ఎన్నికల వేళ బీసీలపై చంద్రబాబు కపటప్రేమ ఒలకబోస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త కారుమూరి నాగేశ్వరరావు అన్నారు.ఎన్నికల ముందు జయహో బీసీ ఎన్నికలయ్యాక పోవాయ్‌ బీసీ అనేది చంద్రబాబు నైజమన్నారు.బీసీలు జడ్జీలుగా పనికిరారని చెప్పిన చంద్రబాబు ఏ మొహం పెట్టుకుని జయహో బీసీ అంటున్నారని ప్రశ్నించారు.నాయీ బ్రాహ్మణులు తమకు జీవనాధారం కష్టంగా ఉందని సీఎం క్యాంపు ఆఫీస్‌కు వస్తే తోలుతీస్తా..తోక కత్తిరిస్తా అంటూ బెదిరింపులకు దిగారని గుర్తుచేశారు.చంద్రబాబుకు జయహో బీసీ అనే అర్హత లేదన్నారు.

2014 ఎన్నికల్లో  బీసీలకు ఇచ్చిన మేనిఫెస్టో మళ్లీ బాబు రిపీట్‌ చేస్తున్నారన్నారు.2014లో బీసీలకు ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు.నిజంగా బీసీలపై ప్రేమ ఉంటే ఒక్కరినైనా రాజ్యసభకు పంపారా అని అన్నారు.బీసీలపై ప్రేమ ఉన్నట్లు చేస్తున్న డ్రామాలను ఈ సారి బీసీలు నమ్మరన్నారు.

 

Back to Top