వైయస్‌ జగన్‌కు ఏపీ ప్రయోజనాలే ముఖ్యం

వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి అనంత వెంకట్రామిరెడ్డి
 

అనంతపురం: వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి అనంత వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. రాజకీయ పార్టీల మాస్కులను చంద్రబాబు జేబుల్లో పెట్టుకొని తిరుగుతున్నారని అనంత వెంకట్రామిరెడ్డి విమర్శించారు. హరికృష్ణ మృతదేహం సాక్షిగా కేసీఆర్‌తో పొత్తు కోసం ప్రయత్నించలేదా అని ప్రశ్నించారు.

ప్రత్యేక హోదా కోసం వైయస్‌ జగన్‌ రాజీలేని పోరాటం చేస్తున్నారని తెలిపారు. ఫెడరల్‌ ఫ్రంట్‌ జాతీయ స్థాయిలో పోరాటానికే వచ్చే ఎన్నికల్లో వైయస్‌ఆర్‌సీపీ ఒంటరిగా పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. 
 

Back to Top