క‌ర్నూలులో వైయ‌స్ఆర్ యంత్ర సేవా ప‌థ‌కం ప్రారంభం

క‌ర్నూలు:  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వైయ‌స్ఆర్‌ యంత్ర సేవ పథకంలో భాగంగా ఈ రోజు కర్నూలు జిల్లా రైతులకు  నగరంలోని ఎస్టిబిసి గ్రౌండ్లో  ట్రాక్టర్లను పంపిణీ చేశారు. కర్నూలు జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరావు , నగర మేయర్ బి.వై. రామయ్య , పత్తికొండ శాసనసభ్యురాలు కంగాటి శ్రీదేవమ్మ, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి,కర్నూలు నగర ఎమ్యెల్యే ఎం.ఏ.హఫీజ్ ఖాన్ ,కోడుమూరు ఎమ్యెల్యే జె.సుధాకర్ బాబు,ఎం.పి. సంజీవ్ కుమార్,జె.సి. రామ్ సుందర్ రెడ్డి, కమిషనర్ భార్గవ్ తేజ,జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ బెల్లం మహేశ్వర రెడ్డి  తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ  సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ‌దేవ‌మ్మ‌ పత్తికొండ నియోజకవర్గం లోని రైతు గ్రూపులకు మంజూరైన 19 ట్రాక్టర్లు లను,  ఇంప్లిమెంట్ లను రైతు గ్రూప్ లకు అందజేశారు.

Back to Top