రేపు వైయస్‌ఆర్‌ జిల్లాకు వైయస్‌ జగన్‌

తాడేపల్లి:  వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి శనివారం వైయస్‌ఆర్‌ జిల్లా పర్యటనకు వెళ్తున్నారు. ఈ నెల 8వ తేదీన తన తండ్రి, దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకొని ఇడుపులపాయలోని మహానేత సమాధి వద్ద నివాళులర్పించేందుకు వైయస్‌ జగన్‌ రేపు సాయంత్రం పులివెందుల వెళ్తున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి విమానం ద్వారా కడప ఎయిర్‌పోర్టుకు చేరుకొని అక్కడి నుంచి రోడ్డు మార్గాన ఇడుపులపాయకు వెళ్తారని వైయస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు సురేష్‌బాబు తెలిపారు.
 

Back to Top