విశాఖ: రాష్ట్ర ఎస్టీ కమిషన్ కమిటీ సభ్యులు మంగళవారం సింహాచలం కొండపై పర్యటించారు. సింహాచలంపై ఉద్యోగాల రిజర్వేషన్ అమలుపై ఏపీ ఎస్టీ శాసన సభా కమిటీ చైర్మన్ బాలరాజు, సభ్యులు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, చెట్టి ఫాల్గుణ ఆరా తీశారు. రాష్ట్రంలో గిరిజన ప్రాంతాల అభివృద్ధితో పాటు, రిజర్వేషన్ల అమలుపై సమగ్ర అధ్యయనం జరుగుతుందని కమిటీ సభ్యులు తెలిపారు. సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు విశాఖ జిల్లాలో రెండు రోజులు పర్యటిస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వ శాఖలో రోస్టర్ విధానంలో ఎస్టీ రిజర్వేషన్ అమలు జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.