మంత్రి పేర్ని నాని ఇంటి వద్ద కాపు కాసి దాడి

పక్కా ప్లాన్‌తోనే  నానిపై హత్యాయత్నం
 

 కృష్ణా: రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నానిపై హత్యాయత్నంలో పోలీసులు కీలక విషయాలను వెల్లడించారు. మంత్రిపై జరిగిన హత్యాయత్నం సమయంలో సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయిన ఫుటేజ్‌ను పోలీసులు మంగళవారం బయటపెట్టారు. పక్కా పధకంతోనే టీడీపీకి చెందిన నాగేశ్వరరావు.. మంత్రి ఇంటి వద్ద కాపు కాసి దాడి చేసినట్టు స్పష్టంగా తెలుస్తోందని పోలీసులు వెల్లడించారు. స్కెచ్ ప్రకారమే మంత్రిపై హత్యాయత్నం చేసినట్లు పోలీస్ విచారణలో వెల్లడికావటంతో ఆ సమయంలో నిందితుడు వెనుక ఎవరు ఉన్నారనే కోణంలో లోతుగా విచారణ సాగుతోందన్నారు.  

కాగా, నాలుగు ప్రత్యేక బృందాలతో దర్యాప్తులో వేగం పెంచామని పోలీసులు తెలిపారు. నిందితుడు నాగేశ్వరరావును కస్టడీకి తీసుకుని విచారిస్తే మరికొన్ని నిజాలు బయటకు వస్తాయని పోలీసులు భావిస్తున్నారు. కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో మంత్రి పేర్ని నాని ఇంటి వద్ద భద్రతను కట్టుదిట్టం చేశామని పోలీసులు పేర్కొన్నారు. 

Back to Top