ఏపీలో నైట్ కర్ఫ్యూ పొడిగింపు 

అమరావతి: కరోనా తీవ్రత దృష్ట్యా రాష్ట్రంలో అమలులో ఉన్న నైట్ కర్ఫ్యూను పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈనెల 14 వరకు నైట్ కర్ఫ్యూను పొడిగించడం జరిగింది. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమలులో ఉండనుంది.

ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూను అమల్లోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. జనవరి 18 నుంచి 31 వరకు నైట్ కర్ఫ్యూను విధిస్తూ ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. కాగా నిన్నటితో గడువు ముగిసిన నేపథ్యంలో మరోసారి  నైట్ కర్ఫ్యూ పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో మరో 14 రోజుల పాటు నైట్ కర్ఫ్యూను పొడిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. 

తాజా వీడియోలు

Back to Top