పొన్నూరులో నేతాజీ జయంతి వేడుకలు 

గుంటూరు జిల్లా: జాతీయ పరాక్రమ దినోత్సవాన్ని పురస్కరించుకొని, మహానీయుడు నేతాజీ సుభాస్ చంద్రబోస్  జయంతి వేడుక‌లు పొన్నూరు మండలం మామిల్లపల్లి గ్రామంలో ఘ‌నంగా నిర్వ‌హించారు.  వైయ‌స్ఆర్‌సీపీ పొన్నూరు నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌ అంబటి మురళి కృష్ణ వేడుక‌ల్లో పాల్గొని మహాత్మాగాంధీ, నేతాజీ సుభాస్ చంద్రబోస్ విగ్రహాలకు పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. అనంతరం ఆయ‌న‌ ప్రసంగిస్తూ, “జైహింద్ నినాదంతో దేశాన్ని ఉర్రూతలూగించిన నేతాజీ, ఆజాద్ హింద్ ఫౌజ్ స్థాపకుడిగా బ్రిటిష్ పాలకుల గుండెల్లో గుబులు రేపారు. ఉన్నత చదువులు, ఎన్నో అవకాశాలు ఉన్నప్పటికీ, వాటన్నింటిని త్యాగం చేసి దేశ సేవకే అంకితమైన మహాత్ముడు నేతాజీ సుభాస్ చంద్రబోస్” అని కొనియాడారు. ఆయన జీవితం నేటి యువతకు శాశ్వత ఆదర్శమని పేర్కొన్నారు. కార్యక్రమంలో రూరల్ పార్టీ అధ్యక్షుడు చింతలపూడి మురళి, రైతు విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు పిచ్చి రెడ్డి గారు, పెన్షనర్స్ నియోజకవర్గ అధ్యక్షుడు అక్కిరెడ్డి , గ్రామ సర్పంచి బుడే , గ్రామ పార్టీ అధ్యక్షుడు కర్లపూడి శ్యామ్  పాల్గొన్నారు.

Back to Top