చంద్రబాబు చేయలేనిదాన్ని సీఎం వైయ‌స్‌ జగన్ చేస్తున్నారు

వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి 

విశాఖ‌: పోలవరం ప్రాజెక్టు కోసం టీడీపీ అధినేత చంద్రబాబు చేసిందేమీ లేదని వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి,  రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విమ‌ర్శించారు. పోలవరం కోసం చంద్రబాబు చేయలేనిదాన్ని ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్ చేస్తున్నారని ఆయ‌న ట్వీట్ చేశారు. సవరించిన తాజా అంచనాలకు కేంద్ర ప్రభుత్వం క్లియరెన్స్ ఇవ్వబోతోందని విజ‌య‌సాయిరెడ్డి తెలిపారు.

ప్రాజెక్ట్ కోసం కాకుండా కమీషన్ల కోసం గతంలో చంద్రబాబు ఢిల్లీ యాత్రలు చేశారని... తన పార్ట్ నర్ రాయపాటి సాంబశివరావు కోసం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారని విమర్శించారు. 2021లోగా పోలవరం పూర్తి చేయాలని కోరుతూ ప్రధాని మోదీకి వైయ‌స్ జగన్ లేఖ రాశారని విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు. 

Back to Top