నీ ఐదేళ్లపాలన కమీషన్ల కోసమే సరిపోయింది బాబు!

వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజయసాయిరెడ్డి  

తాడేప‌ల్లి: గత టీడీపీ హయాంలో పోలవరం విషయంలో పనులు ముందుకు సాగలేదని  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ఆరోపించారు. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు.  కరోనా విజృంభణ నేపథ్యంలో జూమ్‌ యాప్‌ ద్వారా మాట్లాడుతూ చంద్ర‌బాబు గొప్పలు చెప్పుకుంటున్నారంటూ ఎద్దేవా చేశారు. 

'సగం కొట్టుకుపోయిన కాఫర్ డ్యాం కట్టి పోలవరం పూర్తిచేసినట్లు బిల్డప్ ఇచ్చాడు జూమ్ బాబు. నీ ఐదేళ్లపాలన కమీషన్ల కోసం కాంట్రాక్టర్లను మార్చడానికే సరిపోయింది బాబు. పోలవరంలో అసలు డ్యామ్ పునాదులు కూడా తమరు వేయలేదు. ప్రచారం కోసం స్పిల్ వేపై ర్యాంప్ వాక్ అంటూ డ్రామాలు రక్తి కట్టించావ్' అంటూ విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. 

తాజా వీడియోలు

Back to Top