పంచాయతీ ఎలక్షన్లలో నామినేషన్ వేస్తే బాబు బంపర్ ఆఫర్   

 వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి
 

విశాఖ‌:   పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో నామినేష‌న్లు వేసే వారికి చంద్ర‌బాబు బంప‌ర్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించార‌ని,   టీడీపీ మ‌ద్ద‌తుదారులు నామినేష‌న్లు వేస్తే డ‌బ్బులు ఇస్తానంటూ ఆయ‌న చెబుతున్నార‌ని వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి అన్నారు.

'చంద్రబాబు జీవితమంతా డబ్బు వెదజల్లడమే. చివరికి పార్టీ గుర్తుల్లేని పంచాయతీ ఎలక్షన్లలో నామినేషన్ వేస్తే బంపర్ ఆఫర్ రూ.2 లక్షలంట! కాస్త పోటీ ఇస్తారనుకుంటే ఐదు లక్షల రూపాయ‌లు. ఆన్ లైన్ లో అకౌంట్ కే జమ చేస్తాడట. దోచుకున్న లక్షల కోట్లతో ఇలా ఎన్నాళ్లైనా డబ్బు పంపిణీకి సిద్ధమంటున్నాడు' అని విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు.

Back to Top