రామతీర్థం ఘటనపై టీడీపీ రాజకీయం

ఎమ్మెల్సీ పెనుమత్స సురేష్‌
 

విజయనగరం: రామతీర్థం ఘటనపై టీడీపీ రాజకీయం చేస్తుందని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీ  పెనుమత్స సురేష్‌ మండిపడ్డారు. ప్రభుత్వంపై బురద చల్లేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.రామతీర్థం ఘటనపై పోలీసుల విచారణ జరుగుతుందన్నారు.కాగా,  వైయస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి కాసేపట్లో రామతీర్థం ఆలయానికి చేరుకోనున్నారు.రామతీర్థం ఘటనపై ఐదు దర్యాప్తు బృందాలు విచారణ చేయనున్నాయి. ఇప్పటికే పోలీసుల అదుపులో నలుగురు అనుమానితులు ఉన్నారు. రామతీర్థం వద్ద భారీగా పోలీసులు మోహరించారు.
 

తాజా వీడియోలు

Back to Top