నూతన పెన్షన్ల పంపిణీ  

కర్నూలు:  కోడుమూరు నియోజ‌క‌వ‌ర్గంలోని నిర్జూరు గ్రామంలో నూతనంగా మంజూరైన‌ పెన్షన్ల‌ను శాసనసభ్యులు డాక్టర్ జరదొడ్డి సుధాకర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. నూతనంగా మంజూరైన ల‌బ్ధిదారులు  రాష్ట్ర ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. మ‌ళ్లీ వైయ‌స్ జ‌గ‌న్‌ను ముఖ్య‌మంత్రిని చేసుకుంటామ‌ని పింఛ‌న్ ల‌బ్ధిదారులు పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల జెసిఎస్ క‌న్వీన‌ర్ సత్యంరెడ్డి, సర్పంచ్ సంపత్, ప్రసాద్, వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Back to Top