అమరావతి: సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి దేవుడు పంపిన దూతగా భావిస్తున్నానని ఎమ్మెల్యే రెడ్డి శాంతి పేర్కొన్నారు. గురువారం ఆమె సభలో మాట్లాడారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రలో మహిళల కష్టాలు స్వయంగా చూశారు. గత ప్రభుత్వం మహిళలను దగా చేసింది. వైయస్ జగన్ సీఎం అయ్యాక మహిళలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. మహిళలకు అన్నింట 50 శాతం రిజర్వేషన్లు కల్పించారు. అందుకే ప్రతి మహిళా సంతోషంగా, ఆనందంగా ఉన్నారు. దేశంలో ఎక్కడ చూసినా భోటీ బచావ్..భేటీ పఢావ్ అంటున్నారు. సేవ్ గర్ల్స్ అన్న సూత్రాన్ని గ్రహించిన నాయకుడు వైయస్ జగన్. ప్రతి మహిళకు వైయస్ఆర్ చేయూత, ఆసరా వంటి పథకాలతో గౌరవంగా జీవించేలా చేస్తున్నారు. ఓ మహిళగా వైయస్ జగన్‌కు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అమ్మ ఒడి పథకం ద్వారా మహిళలు తమ బిడ్డలను చదివించుకునే శక్తి లభించింది. వైయస్ జగన్‌కు మహిళా తాలుకా అపారమైన గౌరవం, అభిమానం దేవుడిచ్చిన వరం. మహిళలను అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా అడుగులు వేయిస్తున్న జగనన్నకు కృతజ్ఞతలు. మహిళలకు ఊర్లోనే సచివాలయ ఉద్యోగాలు వచ్చాయి. ఈ సమాజంలో అత్యంత వెనుకబడిన తరగతుల్లో ఉన్న వారి పట్ల వైయస్ జగన్ అండగా ఉండటం, ఔదార్యం నిజంగా దేవుడు పంపిన దూతగా భావిస్తున్నాం. దిశ చట్టం దేశానికి ఆదర్శంగానిలిచింది. ఇంత గొప్ప నాయకుడు, మనసున్న నాయకుడు మన రాష్ట్రంలో ఉండటం మనందరి అదృష్టం. ఇంత గొప్ప సంక్షేమ పథకాలు అందజేస్తున్న సీఎం వైయస్ జగన్‌కు మనసారా కృతజ్ఞతలు తెలుపుతున్నానని రెడ్డిశాంతి పేర్కొన్నారు.