అమరావతి: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి బీసీలకు అత్యున్నత స్థానం కల్పించారని ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ పేర్కొన్నారు. గురువారం అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. బీసీలంటే వెనుకబడిన తరగతులు కాదు..వెన్నెముక కులాలని చాటిన వ్యక్తి సీఎం వైయస్ జగన్. బీసీలను టీడీపీ ఓటు బ్యాంకుగానే చూసింది. అమ్మ ఒడి పథకం బలహీన వర్గాలకు ఎక్కువ మేలు జరిగింది. ఒక్కో మహిళకు రూ.15 వేలు అందజేసిన గొప్ప నేత వైయస్ జగన్. వైయస్ జగన్ మనసు పెద్దది. ఆయన వద్ద మేం ఎన్నో నేర్చుకోవాలి. వైయస్ఆర్ ఆసరాలో కూడా రూ.3200 కోట్లు బీసీలకే లబ్ధి పొందారు. వైయస్ఆర్ చేయూత ద్వారా రూ.2380 కోట్లు అందజేస్తున్నారు. నాలుగేళ్లలో రూ.75 వేలు అందజేస్తున్నారు. బీసీలకు ఈ ప్రభుత్వంలో పెద్దపీట వేశారు. మంత్రివర్గంలో కూడా 60 శాతం బీసీలకు ప్రాధాన్యత ఇచ్చారు. సభాపతిని కూడా ఉత్తరాంధ్రకు చెందిన బడుగు బలహీన వర్గాలకు చెందిన నేతకు ఇచ్చారు. రాజ్యసభలో కూడా ఇద్దరు బీసీలకు అవకాశం కల్పించారు. చంద్రబాబు ఉత్తరాంధ్రకు ఒక్క మేలు కూడా చేయలేదు. వైయస్ జగన్ పాదయాత్రలో ప్రజల కష్టాలు చూసి సమ సమాజాన్ని నిర్మిస్తున్నారు. ఈ రోజు వైయస్ జగన్ ఒక విధాతగా, మంచి నేతగా, దేవుడి దూతగా ఉన్నారని ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ పేర్కొన్నారు.