హైకోర్టు తీర్పును స్వాగ‌తిస్తున్నాం

వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌దర్శి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు
 

శ్రీ‌కాకుళం: పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగ‌తిస్తున్నామ‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎమ్మెల్యే ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు పేర్కొన్నారు. ఈ మేర‌కు సోమ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. హైకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ పరమైనది, తీర్పును స్వాగతిస్తున్నామ‌ని చెప్పారు. ఎన్నికల కమిషన్ విడుదల చేసిన రెండవ షెడ్యూల్ అనేది ప్రజలకు రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కులను భంగం కలిగించే విధంగా ఉందని హైకోర్టు భావించింద‌న్నారు.  కొవిడ్ అదుపులోకి వచ్చేవరకు ఎన్నికలు నిర్వహించవద్దని ఎన్నికల కమిషన్ అప్పట్లో వాయిదా వేస్తున్నప్పుడు చెప్పిన మాట ఇద‌ని గుర్తు చేశారు.  ప్రజలకు జీవించే హక్కును గౌరవిస్తామని చెపుతూ.. వాయిదా వేశార‌ని తెలిపారు. ఇప్పుడు హై కోర్టు అదే మాట చెపుతూ.. ప్రజల ఆరోగ్యమే ప్రధానంగా భావించి.. కొవిద్ ఇంకా అదుపులోకి రానందున ఎన్నికలు వాయిదా వేశార‌ని తెలిపారు. కోర్టు ఇచ్చిన తీర్పు సమంజసమైనంద‌ని, దీన్ని అంద‌రూ గౌర‌వించాల‌ని ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు సూచించారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top