అమరావతి భూముల విషయంలో నూటికి నూరు శాతం అక్రమాలే

ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి

గుంటూరు: అమరావతి భూముల విషయంలో నూటికి నూరు శాతం అక్రమాలు జరిగాయని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. సీఐడీ విచారణలో బాధితులు అసలు నిజాలు వెల్లడించారని చెప్పారు. బాధితుల వాంగ్మూలాలను సీఐడీ అధికారులు రికార్డు చేశారని తెలిపారు. భూముల కేటాయింపులో అక్రమాల కేసుపై కోర్టు నాలుగు వారాల వరకు మాత్రమే స్టే ఇచ్చిందని గుర్తు చేశారు. ఫిర్యాదుదారులు, దళితులను టీడీపీ నేతలు భయపెడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. చట్టాలను అతిక్రమించి చంద్రబాబు, నారాయణ భూములతో లబ్ధి పొందారని పేర్కొన్నారు.అప్పటి ఐఏఎస్‌ అధికారులపై ఒత్తిడి తేవడమే కాకుండా  మాట వినని వారిని బదిలీ చేశారన్నారు.

తాజా ఫోటోలు

Back to Top