ప్రతి ఒక్కరూ కోవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకోవాలి

హోంమంత్రి మేకతోటి సుచరిత

గుంటూరు: అపోహలను ప్రక్కన పెట్టి ప్రతి ఒక్కరూ కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలని హోం మంత్రి మేక‌తోటి సుచరిత సూచించారు.  శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. గ్రామ సచివాలయాల్లో సైతం వ్యాక్సిన్‌ సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. అందరూ మాస్క్‌లు ధరించి, భౌతికదూరం పాటించాలని సూచించారు.

కోవిడ్‌తో సహజీవనం చేయాల్సి వస్తుందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పినప్పుడు అపహాస్యం చేశారని.. ఇప్పుడు అదే జరుగుతుందన్నారు. మాస్క్ లు ధరించడం, చేతులు శుభ్రం చేసుకోవడం, సామాజిక దూరం పాటించడం లాంటి నియమాలు తప్పనిసరిగా పాటించాలని హోం మంత్రి సూచించారు.

తాజా ఫోటోలు

Back to Top