క్ష‌త్రియ కార్పొరేష‌న్ చైర్మ‌న్ కు మంత్రి ధ‌ర్మాన నివాళి 

శ్రీ‌కాకుళం: ఇటీవ‌ల మరణించిన క్షత్రియ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పాతపాటి సర్రాజు కు రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు నివాళులర్పించారు. ఆయ‌న చిత్రపటానికి పూల మాల‌లు వేసి అంజ‌లి ఘ‌టించారు. సోమవారం ఉదయం భీమవరంలోని ఆయన నివాసానికి మంత్రి ధర్మాన చేరుకొని, కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. కార్య‌క్ర‌మంలో భీమవరం శాసనసభ్యులు గ్రంధి శ్రీనివాస్ , జిల్లా పరిషత్ చైర్మన్ కవురి శ్రీనివాస్, పివిఎల్ నరసింహారాజు తదితరులు పాల్గొన్నారు.

Back to Top