రెండు గంటల్లో పరిస్థితి అదుపులోకి వస్తుంది

సీఎం వైయస్‌ జగన్‌ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు

మంత్రి కురసాల కన్నబాబు

విశాఖ: విశాఖపట్నం జిల్లా పరిధిలోని ఆర్‌ఆర్‌ వెంకటాపురంలో ఉన్న ఎల్‌జి పాలిమర్స్‌లో రసాయన వాయువు లీకేజీ ఘటనపై మంత్రి కన్నబాబు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మరో రెండు గంటల్లో పరిస్థితి పూర్తిస్థాయిలో అదుపులోకి వస్తుందని మంత్రి పేర్కొన్నారు. విశాఖ ఘటనపై సీఎం వైయస్‌ జగన్‌ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారని, ఘటన ప్రాంతానికి మరికాసేపట్లో చేరుకోనున్నారని కన్నబాబు తెలిపారు.బాధితులందరికీ మెరుగైన వైద్యం అందిస్తున్నామని చెప్పారు.
 

Back to Top