గవర్నర్‌ ప్రసంగంతో ప్రజల్లో సంతోషం

అవినీతి రహిత పాలనతో ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు

మేనిఫెస్టోలోని అంశాల అమలు దిశగా ముఖ్యమంత్రి అడుగులు

డిప్యూటీ సీఎం, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అంజద్‌బాషా

 

వెలగపూడి: గవర్నర్‌ ప్రసంగం ద్వారా రాష్ట్ర ప్రజలంతా సంతోషంగా ఉన్నారని డిప్యూటీ సీఎం అంజద్‌బాషా అన్నారు. ప్రజలకు మన ప్రభుత్వం గొప్ప పాలన అందిస్తుందన్నారు. గవర్నర్‌ ప్రసంగం అనంతరం డిప్యూటీ సీఎం అంజద్‌బాషా మీడియాతో మాట్లాడుతూ.. అవినీతి రహిత పాలన అందిస్తుందనే మెసేజ్‌ వినడానికి ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూశారన్నారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో అవినీతి రహిత పాలన వస్తుంది.. అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. రాష్ట్రం అభివృద్ధివైపు దూసుకుపోతుందన్నారు. అవినీతి రహిత పరిపాలనతో ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందుతాయని, మేనిఫెస్టోను ఖురాన్, బైబిల్, భగవద్గీతలా భావిస్తానని చెప్పిన ముఖ్యమంత్రి.. మేనిఫెస్టోలో పొందుపర్చిన అంశాలను అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నారన్నారు. 

నవరత్నాలతో రాష్ట్ర ప్రభుత్వం చేయబోతున్న మేలును గవర్నర్‌ ప్రసంగం ద్వారా వివరించామని డిప్యూటీ సీఎం అంజద్‌ బాషా అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి మొదటి ప్రాధాన్యత ఉంటుందని, ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పడం జరిగిందన్నారు. జలయజ్ఞంలో భాగంగా ప్రాజెక్టులన్నీ పూర్తిచేసి ప్రతి ఎకరానికి నీరు అందిస్తామని గవర్నర్‌ ప్రసంగం ద్వారా రాష్ట్ర ప్రజలకు వివరించామన్నారు. పగటి పూటనే రైతులకు ఉచితంగా 9 గంటల కరెంటు ఇస్తామని, రైతు భరోసా కింద ప్రతి రైతు కుటుంబానికి రూ. 12,500 పెట్టుబడి సాయం అందజేస్తామన్నారు. నిరుద్యోగ వ్యవస్థను రూపుమాపేందుకు గ్రామ వలంటీర్లు, గ్రామ సెక్రటేరియట్‌ ద్వారా లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ పాలనలో అన్ని వర్గాలకు మేలు జరుగుతుందన్నారు.  

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top