సర్వేపల్లి లో జగనన్న జన్మదిన వేడుకలు 

 నెల్లూరు జిల్లా:  ముఖ్యమంత్రి శ్రీ వై.యస్.జగన్ మోహ‌న్ రెడ్డి గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ముత్తుకూరు మండలం పంటపాళెం గ్రామ పంచాయితీ, కోడెలమిట్ట గ్రామంలో జగనన్న పచ్చ తోరణం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటి, స్థానికులకు మామిడి, జామ మొక్కలను పంపిణీ చేసిన రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి  కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు. వైయ‌స్ జ‌గ‌న్ గారి జన్మదిన వేడుకల్లో భాగంగా, స్థానిక యువత ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన జగనన్న సంబరాల్లో పాల్గొని, కేక్ కట్ చేసిన మంత్రి కాకాణి.  సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళుగా ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారి పరిపాలన సాగిస్తున్నారని పేర్కొన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి  

Back to Top