టీడీపీ హయాంలో విచ్చలవిడిగా భూకబ్జాలు

డిప్యూటీ సీఎం ఆళ్ల నాని
 

విజ‌య‌వాడ‌: టీడీపీ హయాంలో విచ్చలవిడిగా భూకబ్జాలు, దాడులు జరిగాయని డిప్యూటీ సీఎం ఆళ్ల నాని పేర్కొన్నారు. చంద్రబాబు హయాంలో రాష్ట్రాన్ని పేకాట శిబిరం చేశారని విమర్శించారు. గత ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపినందుకే.. మంత్రి కొడాలి నానిపై దాడులు చేస్తున్నారని ఆళ్ల నాని విమర్శించారు. సంక్షేమ పథకాలు అమలైతే నామరూపాలు లేకుండా పోతామనే భయంతో.. రాష్ట్రంలో ప్రతిపక్షాలు విద్వేషాలు రెచ్చగొడుతున్నాయని ఆళ్ల నాని విమర్శించారు.

Back to Top