69 మంది డిశ్చార్జ్‌..57 మందికి కరోనా పాజిటివ్‌

తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా బాధితులు కోలుకుంటున్నారు. గడిచిన 24 గంటల్లో 69 మంది కరోనా నుంచి కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ కాగా, మరో 57 మందికి పాజిటివ్‌ నమోదు అయ్యిందని హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేశారు. 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో 9,739 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనాతో కోలుకొని 1,596 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.ప్రస్తుతం రాష్ట్రంలో 691 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

Back to Top