ఐటీ, స్కిల్‌ డెవలప్‌మెంట్‌పై సీఎం సమీక్ష

 తాడేపల్లి: ఐటీ, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ శాఖలపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అధికారులు, మంత్రులతో సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన సమీక్షలో మంత్రి మేకపాటి గౌతంరెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ చెల్లా మధుసుదన్‌రెడ్డి, అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో 30 స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేంద్రాలు, నాలుగు ట్రిపుల్‌ ఐటీలకు అనుబంధంగా నాలుగు కేంద్రాలు, పులివెందుల జేఎన్‌టీయూకు అనుబంధంగా మరో కేంద్రం, విశాఖలో ఐటీపై హై ఎండ్‌ స్కిల్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
 

తాజా వీడియోలు

Back to Top