మాయమైన బంగారు ఆభరణాలు వెంటనే అంద‌జేయండి

 డిప్యూటీ సీఎం ఆళ్ల‌నాని ఆదేశం
 

  అమరావతి: తిరుపతి స్విమ్స్ కోవిడ్ హాస్పిటల్‌లో మృతదేహాలపై బంగారు ఆభరణాలు మాయం వ్యవహారంపై ఏపి డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని సీరియస్ అయ్యారు. ఈ వ్యవహారంపై మంత్రి నాని తిరుపతి స్విమ్స్ హాస్పిటల్ డైరెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడి తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.  తిరుపతి స్విమ్స్ కోవిడ్ హాస్పిటల్ లో బంగారు ఆభరణాలు దొంగిలించిన వ్యక్తి పై స్విమ్స్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ వెంగమ్మఅలిపిరి పోలీస్ స్టేషన్‌లో పిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై  పూర్తి స్థాయిలో విచారణ చేసి నివేదిక ఇవ్వాలని స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ వెంగమ్మను మంత్రి ఆళ్ల నాని ఆదేశించారు.  

రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. తిరుపతి స్విమ్స్ హాస్పిటల్‌లో జరిగిన ఈ సంఘటనపై మంత్రి ఆళ్ల నాని ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెప్పించుకుంటున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్‌మోహన్‌ రెడ్డి కరోనా బాధితులకు అండగా ఉంటూ వారి ఆరోగ్యం మెరుగుదలకు కోట్లు రూపాయలు ఖర్చు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గవర్నమెంట్ కోవిడ్ హాస్పిటల్స్ గాని, ప్రైవేట్ హాస్పిటల్స్‌లో గాని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నాం. ఎక్కడైనా మళ్ళీ ఇలాంటి సంఘటనలు జరిగితే బాధ్యులపై కఠినంగా చర్యలు తీసుకుంటాం. ఎవరిని వదిలే ప్రసక్తే లేదు అని వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు.  
  

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top