కర్నూలు: వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం 4వ రోజు షెడ్యూల్ ను విడుదల చేశారు. శనివారం ఉదయం 9 గంటలకు పత్తికొండలోని రాత్రి బస చేసిన ప్రాంతం దగ్గర నుంచి బయలుదేరరుతారు.రాతన మీదుగా తుగ్గలి చేరుకుంటారు. ఉదయం 10 గంటలకు గ్రామస్థులతో ముఖముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం జొన్నగిరి, గుత్తి మీదుగా ప్రయాణించి గుత్తి శివారులో భోజనవిరామం తీసుకుంటారు. సాయంత్రం 3 గంటలకు బయలుదేరి పామిడి, కల్లూరు, అనంతపురం బైపాస్, రాప్తాడు బైపాస్ , ఆకుతోటపల్లి , సంజీవపురం శివారు వరకు బస్ యాత్ర కొనసాగుతుంది. సంజీవపురం శివారులో రాత్రి బస శిబిరానికి చేరుకుంటారని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం తెలిపారు.