<strong>పొదుపు సొమ్ము కూడా దోచుకుంటున్నారు..</strong><strong>తీవ్ర నీటికొరత ఉన్నా పట్టించుకోని టీడీపీ ప్రభుత్వం</strong><strong>చంద్రబాబు సర్కార్‌పై మహిళల ఆగ్రహం</strong>విజయనగరంః టీడీపీ కార్యకర్తలకు మాత్రమే రేషన్‌కార్డులు, పింఛన్లు, రుణాలు ఇస్తున్నారని విజయనగరం మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.పట్టణంలో మంచినీటి కొరత తీవ్రంగా ఉందని మూడురోజులకోసారి కుళాయిలు వస్తున్నాయని వాపోయారు. వైయస్‌ఆర్ హయాంలో వందకోట్లతో నిర్మించిన శ్రీరామతీర్థం మంచినీటి పథకాన్ని టీడీపీ ప్రభుత్వం నీరిగార్చిందన్నారు. జగన్ నాయకత్వంలో ఆ పథకాన్ని ప్రారంభిస్తే వైయస్ జగన్‌కు రుణపడి ఉంటామన్నారు. రెండు సంవత్సరాలుగా వడ్డీలేని రుణాలు కూడా అమలు కావడంలేదన్నారు. దివంగత మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో మాకు ఎంతో మేలు జరిగిందని, నేడు టీడీపీ పాలనలో అష్టకష్టాలు పడుతున్నామన్నారు. రాజన్న బిడ్డ వైయస్ జగన్ వస్తేనే గాని విజయనగరం అభివృద్ధితో పాటు ప్రజల కష్టాలు తీరిపోతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. వైయస్‌ఆర్ పాలన తలపించే సుభిక్ష పాలన రావాలంటే వైయస్ జగన్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలన్నారు.