<strong>వైయస్ జగన్‌కు వృద్ధుల మొర...</strong>విజయనగరంః డబ్బై ఏళ్లు నిండినా పింఛన్లు ఇవ్వడం లేదని కురుపాం నియోజకవర్గం నాగూర్‌కు చెందిన వృద్ధులు వైయస్ జగన్‌కు మొరపెట్టుకున్నారు.జన్మభూమి కమిటీలకు చెందినవారికే పింఛన్లు ఇస్తున్నారని వాపోయారు.జన్మభూమి కమిటీ ఆగడాలు భరించలేకపోతున్నామన్నారు.సొంత పార్టీలవారికే లబ్ధి చేకూరుస్తున్నారని, ఇతర పార్టీల వారిని పక్కన పెడుతున్నారన్నారు.అర్హతలున్నా పట్టించుకోవడంలేదన్నారు. అధికారుల చుట్టూ తిరుగుతున్నా స్పందించడంలేదని స్థానిక నాయకులను కలవాలని చెబుతున్నారన్నారు.అధికారంలోకి వచ్చిన తర్వాత పింఛన్లు అర్హులందరికి ఇస్తామని వైయస్ జగన్ తెలిపారన్నారు.