అదంతా మహానేత వైయస్‌ఆర్‌ చలువే..

విశాఖ జిల్లాః నేడు  అర్చకులు,పురోహితులు కడుపు నిండా అన్నం తింటున్నారంటే మహానేత దివంగత వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి చేపట్టిన సంస్కరణలే కారణమని ఉత్తరాంధ్ర అర్చకుల సంఘం నాయకులు దీక్షితులు అన్నారు.87 చట్టం ద్వారా అర్చకులకు,ఆలయానికి మంచి చేయాలనే సంకల్పంతో ఎంతో మేలు  చేశారన్నారు.ౖ వెయస్‌ఆర్‌ బతికుంటే ఆలయ వ్యవస్థ దేదీప్యమానంగా ఉండేదన్నారు. టీడీపీ పాలనలో బ్రాహ్మణ్యంలో పురోహితులు, అర్చకులు చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు.. దేవాలయ భూములన్నీ కబ్జాసురుల చేతుల్లోకి వెళ్లిపోయి దేవాలయాలు మూతపడే స్థితికి వచ్చాయన్నారు. విశాఖలో బ్రాహ్మణ ఆత్మీయ సమావేశానికి రానున్న వైయస్‌ జగన్‌ కోసం బ్రాహ్మణులంతా ఎదురుచూస్తున్నామన్నారు.  వైయస్‌ జగన్‌ బ్రాహ్మణులతో ఆత్మీయ సమావేశం నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. వ్యవస్థ బాగుపడాలంటే జగన్‌ రావాలన్నారు. 
  

తాజా ఫోటోలు

Back to Top