రోడ్డు సౌకర్యానికి కూడా నోచుకోలేదయ్యా...

జననేతకు కిజ్జాడ గ్రామస్తుల మొర...
విజయనగరంః తమ గ్రామానికి కనీస రోడ్డు సౌకర్యం కూడా లేదని కురుపాం మండలం కిజ్జాడ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సంకల్పయాత్రలో వైయస్‌ జగన్‌ను కలిసి తమ మొర వినిపించారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోయారు..గర్భిణుల కోసం అంబులెన్స్‌లు కూడా రాలేని పరిస్థితి ఉందని జననేతకు ఫిర్యాదు చేశారు.టీడీపీ పాలనలో గిరిజనుల సంక్షేమం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనేక సమస్యలతో నిత్యం సతమతమవుతున్నామని గిరిజనులు తెలిపారు.దివంగత వైయస్‌ఆర్‌ హయాంలో ఎంతో మేలు జరిగిందని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.రాజన్న బిడ్డ అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు.
Back to Top