గుంటూరు:‘నేను ఏఎన్‌ఎం ఉద్యోగానికి అర్హత సాధించి పదహారేళ్లు గడిచిందని.. ఏజ్ లిమిట్ కూడా దాటిపోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు’ అంటూ స్టూవర్టుపురానికి చెందిన మోతా జయలక్ష్మి జననేత వద్ద ఆవేదన వ్యక్తం చేసింది. మార్చి 20తో వయో పరిమితి దాటిపోతుందని కలెక్టర్ కార్యాలయంతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల చుట్టూ తిరిగినా ఫలితం లేదని వాపోయింది. ఇటీవల స్థానిక ఎమ్మెల్యే కోన రఘుపతిని కలసి సమస్యను విన్నవించానని, ఆయన సూచనల మేరకు కలెక్టరేట్‌కు వెళ్లడంతో కాస్త స్పందన కనిపించిందన్నారు. నాలుగు నెలల కిందట ఆశ కార్యకర్తగా విధుల్లో చేరితే.. వైయస్ఆర్ సీపీ అని ముద్రవేసి ఆ ఉద్యోగం నుంచి తొలగించి టీడీపీ వాళ్లకి కట్టబెట్టారని వైయస్ జగన్ దృష్టికి తీసుకొచ్చారు. ప్రస్తుతం భర్తతో పాటు కూలి పనులకు వెళ్తూ పిల్లలను పోషించుకుంటున్నామని చెప్పారు. <br/>