వైయ‌స్ఆర్‌ అంటే అభిమానం.. జగన్‌ అంటే ప్రాణంవిశాఖపట్నం:  దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి అంటే అభిమానం..వైయ‌స్ జగన్‌ అంటే ప్రాణమ‌ని అందుకే సంకల్పయాత్రలో పాల్గొంటున్నానని కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన దివ్యాంగుడు ఎస్‌కే అజీమ్‌ తెలిపారు. మే 7న వైయ‌స్ఆర్‌సీపీ నేత కొడాలి నాని ఆధ్వర్యంలో జగనన్న సంకల్ప యాత్ర జరిగిందని, మరుసటి రోజు నుంచి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డితో పాదయాత్రలో కొనసాగుతున్నానని చెప్పారు. ‘2003లో వైయ‌స్‌ రాజశేఖరరెడ్డితో కూడా కొంతకాలం పాదయాత్రలో పాల్గొన్నాను. 2014లో జరిగిన రోడ్డు ప్రమాదంలో కాలు విరిగిపోయింది. సంకల్పయాత్రలో ఇబ్బందులుంటాయని జగనన్న చెప్పారు. అయినా అయనతో పయనించాలని నిర్ణయించుకున్నాను.’ అన్నారు.  వీల్‌ చైర్‌లో సంకల్పయాత్రలో పాల్గొంటున్న అజీమ్‌ను పలువురు అభినందించారు.
Back to Top