చిత్తూరు: ‘సామీ మాది ఊరి బయట ఉన్న ఎస్సీ కాలనీ. పదిహేనేళ్లకు పైగా ఇక్కడే ఉన్నాం. రోడ్లు లేవు. నీళ్లు రావు. చాలా మందికి సొంతిళ్లు కూడా లేవు’ అంటూ మదనపల్లె రూరల్‌కు చెందిన సుగుణ ఇతర మహిళలు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డికి విన్నవించుకున్నారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా తమ ఊరి చివర వేచి ఉన్న మహిళల్ని జననేతను ఆప్యాయంగా పలకరించారు. కొంత దూరం ఆయనతో కలసి నడిచిన మహిళలు గ్రామంలోని సమస్యల్ని వివరించారు. ఎస్సీ కాలనీల్లో మౌలిక వసతులు, సదుపాయాలు కల్పించాలన్నారు.