విజయనగరంః కేబుల్ ఆపరేటర్లు తమ సమస్యలను వైయస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు. కేబుల్ నెట్‌వర్క్‌లను కూడా తెలుగు తమ్ముళ్లకు అప్పగించే యత్నం చేస్తున్నాని ఆవేదన వ్యకం చేశారు. 25 ఏళ్లుగా కేబుల్ రంగంపై ఆధారపడి బతుకుతున్నామన్నారు. కేబుల్ బిల్లు రూ.149 మాత్రమే చెల్లించాలని పెద్దబాబు,చినబాబు ప్రకటనలు గుప్పిస్తున్నారని, కాని మాకు బాక్స్‌రెంట్,జీఎస్టీ అని కలిపి 235 రూపాయలు అవుతుందన్నారు. కస్టమర్లు దగ్గరకు వెళ్ళి 236 రూపాయలు చెల్లించమంటే వారి నుంచి చీతార్కాలు,అవమానాలు ఎదురవుతున్నాయని కేబుల్ ఆపరేటర్లు ఆవేదన వ్యక్తం చేశారు.అలాగే విద్యుత్ శాఖ పోల్ టాక్స్ అంటూ ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు.