<br/><br/>విశాఖ: ‘బాబూ మీ నాన్న వైయస్ రాజశేఖరరెడ్డి మాదిరిగా ప్రజలకు మంచి చేయాలని, అలా చేస్తావన్న నమ్మకం ఉందని ఓ శాతాధిక వృద్ధుడు వైయస్ జగన్‌ను దీవించారు. ప్రజా సంకల్ప యాత్ర 266వ రోజు విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలో కొనసాగింది. పాదయాత్రలో నేమగొట్టిపాలెంకు చెందిన వందేళ్ల వృద్ధుడు గొలగాని అప్పలస్వామి జననేతను కలిశారు. ఈ సందర్భంగా పెద్దాయనను రాజన్న బిడ్డ ఆప్యాయంగా దగ్గరకు తీసుకొని మాట్లాడారు. ఆ పెద్దాయన మాట్లాడుతూ..బాబూ మీనాన్న పేరు నిలబెట్టాలి... ప్రజలంతా నీపై ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. రాముడిలాంటి పాలన అందించు’ అని ఆశీర్వదించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి అంటే విఫరీతమైన అభిమానమని చెప్పారు. జగన్ మా ఊరికి వస్తున్నాడంటే ఎప్పుడెప్పుడు కలవాలా అని రెండు రోజులుగా ఎదురు చూస్తున్నానని పేర్కొన్నారు. వైయస్ఆర్ హయాంలో నాకు పింఛన్ వచ్చింది. ప్రస్తుతం నాలాంటోళ్లు చాలా మంది పింఛన్ల కోసం ఎదురుచూస్తున్నారు. ఎండలో ఎంతో కష్టపడి నడుస్తున్నావు. నీ కష్టం ఊరికే పోదు. వచ్చే ఎలక్షన్లో నువ్వు కచ్చితంగా గెలుస్తావు. మంచిగా పాలించు నాయనా.. అంటూ చెప్పారు.