అనంతపురం: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అనంతపురం జిల్లా తాడిపత్రి చేరుకున్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్‌కు మంత్రి ఉషాశ్రీ చరణ్, ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్యేలు పెద్దారెడ్డి, తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, అనంత వెంకట్రామిరెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. మరికాసేపట్లో తాడిపత్రి వైయస్ఆర్ సర్కిల్‌కు సీఎం చేరుకోనున్నారు. తాడిపత్రి నుంచి మలివిడత ఎన్నికల ప్రచారాన్ని సీఎం ప్రారంభించనున్నారు. వైయస్ఆర్ సర్కిల్‌లో తాడిపత్రి ప్రజలను ఉద్దేశించి సీఎం వైయస్ జగన్ ప్రసంగించనున్నారు. తాడిపత్రి సభ అనంతరం తిరుపతి లోక్‌సభ స్థానం పరిధిలోని వెంకటగిరిలోని త్రిభువని సర్కిల్‌లో నిర్వహించే బహిరంగసభలో పాల్గొని ప్రసంగిస్తారు. అక్కడి నుంచి నెల్లూరు లోక్‌సభ స్థానం పరిధిలోని కందుకూరు కేఎంసీ సర్కిల్‌లో జరిగే సభలోనూ సీఎం వైయస్ జగన్ పాల్గొంటారు.