ఇంటింటి అభివృద్ధి కొనసాగాలంటే మళ్లీ వైయ‌స్ఆర్‌సీపీనే గెలిపించాలి

పిఠాపురం ఎన్నిక‌ల ప్ర‌చారంలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి విజ్ఞ‌ప్తి

సాధ్యం కాని హామీలతో చంద్రబాబు మేనిఫెస్టో

పొరపాటున బాబుకు ఓటు వేస్తే ప్రజలు మోసపోయినట్లే

చంద్రబాబును నమ్మడం అంటే కొండ చిలువ నోట్లో తలపెట్టడమే

కూటమికి ఓటేస్తే పథకాలన్నిటింకీ ముగింపే

గతంలో ఎన్నికల తర్వాత మేనిఫెస్టోను కూటమి నేతలు చెత్తబుట్టలో వేశారు

చంద్రబాబు గత చరిత్ర చెబుతున్న సత్యం ఇదే
 
2 లక్షల 70 వేల కోట్ల రూపాయలు నేరుగా ప్రజల ఖాతాల్లో వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం జమ చేసింది

రాబోయే ఐదేళ్ల ఇంటింటి అభివృద్ది, పథకాల కొనసాగింపును నిర్ణయించే ఎన్నికలు.

ఐదేళ్లు లంచాలు, వివక్ష లేకుండా సంక్షేమ పథకాలు అందించాం. ఇంటి వద్దకే పెన్షన్‌, పౌరసేవలు, పథకాలు ఇస్తున్నాం. 

2 లక్షల 31 వేల ఉద్యోగాలు ఇచ్చాం

ఎన్నికల మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా భావించి 99 శాతం హామీలు అమలు చేశాం. 

గతంలో ఎప్పుడైనా ఈ పథకాలు చూశారా. అక్కాచెల్లెమ్మల పేరుపై 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చాం. 

రైతులకు పగటిపూటే 9 గంటల ఉచిత విద్యుత్‌ ఇస్తున్నాం. 

విత్తనం నుంచి పంట కొనుగోలు వరకు రైతన్నకు తోడుగా ఉన్నాం. 

డ్రైవర్‌ అన్నదమ్ములకు వాహనమిత్ర, నేతన్నలకు నేతన్న నేస్తం.

జగనన్న తోడు, చేదోడుతో చిరు వ్యాపారులకు తోడుగా నిలిచాం

స్వయం ఉపాధికి గతంలో ఈ పథకాలు ఉన్నాయా?. 

59 నెలల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్‌, బైబిల్‌గా భావించాం. 

మన మేనిఫెస్టోను నేరుగా ఇళ్లకే పంపి ఆశీస్సులు తీసుకున్నాం.

వంగా గీతను గెలిపించుకోండి.. డిప్యూటీ సీఎంను చేస్తాను

పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న దత్తపుత్రుడికి ఓటు వేయకండి..

దత్తపుత్రుడికి ఓటేస్తే ఇక్కడే ఉంటాడా? హైదరాబాద్ వెళ్తాడా?

గాజువాక, భీమవరం అయిపోయింది.. ఇప్పుడు పిఠాపురం అంటున్నారు

దత్తపుత్రుడిని మహిళలు నమ్మే పరిస్థితి ఉంటుందా?

5 ఏళ్లకోసారి కార్లు మార్చినట్టుగా భార్యలను మారుస్తున్నాడు

దత్తపుత్రుడు గెలిస్తే పిఠాపురంలో ఉండడు: సీఎం జగన్‌

కాకినాడ జిల్లా: ఇంటింటి అభివృద్ధి కొనసాగాలంటే మళ్లీ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. సాధ్యంకాని హామీలతో చంద్రబాబు మేనిఫెస్టో ఇచ్చారని.. పొరపాటున బాబుకు ఓటు వేస్తే ప్రజలు మోసపోయినట్టేనని ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. పిఠాపురంలో వంగా గీతను గెలిపిస్తే డిప్యూటీ సీఎం చేస్తానని హామీ ఇచ్చారు. చిన్న జలుబు చేస్తే దత్తపుత్రుడు పిఠాపురం నుంచి హైదరాబాద్ పారిపోయాడని విమర్శించారు. మహిళలు దత్త పుత్రుడును నమ్మే పరిస్థితి ఉందా? అని ప్రశ్నించారు. ఐదేళ్లకి ఒకసారి కార్లు మార్చినట్లు భార్యలు మారుస్తాడు.. ఈయన ఎమ్మెల్యే అయితే మహిళలు కలిసే పరిస్థితి ఉంటుందా? అని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గాజువాక, భీమవరం అయిపోయింది.. ఇప్పుడు పిఠాపురం అని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిఎద్దేవా చేశారు. శనివారం ఆయన పిఠాపురంలో ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ కూటమి మోసాలను ఎండగట్టారు. 

 
ఈ సంద‌ర్భంగా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఏమ‌న్నారంటే..

పిఠాపురం సిద్ధ‌మా 
చిక్కటి చిరునవ్వుల మధ్య మీ ఆప్యాయతలకు, మీ ప్రేమానురాగాలు మీ బిడ్డ ఎప్పుడూ రుణపడి ఉంటాడు. ఇక్కడకు వచ్చిన నా ప్రతి అక్కకూ, నా ప్రతి చెల్లెమ్మకూ,ప్రతి అవ్వకూ, ప్రతి తాతకూ, నా ప్రతిసోదరుడికీ, స్నేహితుడికీ ..మీ అందరి ఆప్యాయతలతకు, ప్రేమానురాగాలకు,ఆత్మీయతలకు మీ బిడ్డ.. మీ జగన్ రెండు చేతులు జోడించి పేరుపేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాడు.

మీ జగన్‌కు ఓటు ఇంటింటి అభివృద్ధి కొనసాగింపు.
కురుక్షేత్ర మహాసంగ్రామానికి కేవలం 36 గంటలు ఉంది .జరగబోయే ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను మాత్రమే ఎన్నుకునేందుకు జరుగుతున్న ఎన్నికలు కావు. ఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్ల మీ ఇంటింటి అభివృద్ధిని, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు.
ఈ ఎన్నికల్లో జగన్‌కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు. ఇంటింటి అభివృద్ధి. అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే... చంద్రబాబు కూటమికి ఓటువేస్తే.. పథకాలన్నీ ముగింపు. మళ్లీ మోస పోవడమే. ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. ఇదే చంద్రబాబు గత చరిత్ర చెబుతున్న సత్యం. ఇదే మోసపూరిత వాగ్దానాలతో, సాధ్యం కాని హామీలతో చంద్రబాబు చేసిన మేనిఫెస్టోకి అర్ధం. చంద్రబాబును నమ్మడం అంటే కొండచిలువ నోట్లో తలపెట్టడమే అన్నది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలని కోరుతున్నాను. 

ఈ 59 నెలల్లో మీ బిడ్డ ఏం చేశాడంటే...
ఈరోజు ఈ 59 నెలల కాలంలో, గతంలో ఎప్పుడూ జరగని విధంగా, ఈ రాష్ట్రంలో ఎప్పుడూ చూడని విధంగా మీ బిడ్డ ఏం చేసాడు, ఏమేం పథకాలు తీసుకొచ్చాడు, ఏమేం మార్పులు తీసుకొచ్చాడు అని మీ అందరితో పంచుకుంటాను. మీరే ఆలోచన చేయాలని కోరుతున్నాను. 
గతంలో ఎప్పుడూ జరగని విధంగా, రాష్ట్రచరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా...నా అక్కచెల్లెమ్మల కుటుంబాల కొరకు వివిధ పథకాల ద్వారా 130 సార్లు బటన్‌ నొక్కి రూ.2.70 లక్షల కోట్లు ఎటువంటి లంచాలు, వివక్ష లేకుండా నేరుగా నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి, వారి చేతికే నేరుగా వెళ్లాయి. ఇలా బటన్ నొక్కడం, అక్కచెల్లెమ్మల ఖాతాలకు నేరుగా డబ్బు వెళ్లిపోవడం గతంలో ఎప్పుడైనా జరిగిందా? అని అడుగుతున్నాను. 

మీ బిడ్డ పాలన రాక ముందు వరకూ మన రాష్ట్రంలో మొత్తం 4 లక్షల   ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటే.. మీ బిడ్డ వచ్చిన ఈ 59 నెలల కాలంలో మరో 2.31 లక్షలఉద్యోగాలు ఇచ్చాడు. మన పిల్లలు... నా చెల్లెమ్మలు, నా తమ్ముళ్లే 1,35,000 మంది గ్రామసేవలో గ్రామసచివాలయాల్లో కనిపిస్తారు. 

గతంలో మేనిఫెస్టో అంటే రంగు,రంగుల అబద్ధాలు.
ఇంతకుముందు ఎప్పుడైనా మేనిఫెస్టో అంటే అర్థం  ఏం కనిపించేది అంటే...ఎన్నికలప్పుడు మేనిఫెస్టో అని చెప్పి రంగురంగుల కాగితాలు ఇచ్చేవారు. రంగురంగుల అబద్ధాలు చెప్పేవారు. పేదల ఆశలతో  ఆడుకునేవారు...అబద్ధాలకు రెక్కలు కట్టేవారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత మేనిఫెస్టో చెత్తబుట్టలో వేసేవారు. ఎన్నికల తర్వాత మేనిఫెస్టో ఎక్కడ ఉంది అంటే ఎక్కడ వెతికినా కనిపించని పరిస్థితి. మొట్టమొదటిసారిగా ఈ సంప్రదాయాన్ని మీ బిడ్డ మార్చాడు.

మీ బిడ్డ హయాంలో 99శాతం మేనిఫెస్టో హామీలు అమలు 
ఎన్నికల మేనిఫెస్టోను ఒక భగవద్గీతగా, ఖురాన్‌గా, బైబిల్‌గా భావిస్తూ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినవి ఏకంగా 99 శాతం హామీలను అమలు చేసి...నా అక్కచెల్లెమ్మల కుటుంబాలకే పంపుతున్నాడు. ఇదిగో మీ అన్న మేనిఫెస్టో... పథకాలన్నీ కూడా జరిగాయా లేదా మీరే టిక్‌ పెట్టండి అంటూ...ఎన్నికల మేనిఫెస్టో అంటే విశ్వసనీయత తీసుకువచ్చిన వ్యక్తి, విశ్వసనీయత తీసుకు వచ్చిన పాలన ఈ 59 నెలల కాలంలోనే జరగడం వాస్తవం కాదా? అని అడుగుతున్నాను. 

ఇప్పుడు నేను గడ,గడా మచ్చుకు కొన్ని పథకాలు పేర్లు చెబుతాను. ఈ పథకాలు గతంలో ఎప్పుడైనా ఉన్నాయా? ఈ పథకాలు గతంలో ఎప్పుడైనా మీరు చూశారా? ఈ పథకాలు గతంలో ఎవరైనా చేశారా ? అన్నది నేను మిమ్నల్నే ఆలోచన చేయమని కోరుతున్నాను.
మొట్టమొదటిగా నాడు నేడుతో బాగుపడ్డ గవర్నమెంటు స్కూళ్లు, గవర్నమెంటు స్కూళ్లన్నీ ఇంగ్లిషు మీడయం, 6వ తరగతి నుంచే క్లాస్ రూమ్ లలో ఐఎఫ్‌బీలతో డిజిటల్ బోధన, 8వతరగతికి వచ్చేసరికి ప్రతి పిల్లాడి చేతిలో ఒక ట్యాబులు, ఇంగ్లిషు మీడియంతో మొదలుపెడితే 3వ తరగతి నుంచే ప్రభుత్వ బడులలో టోఫెల్ క్లాసులు, 3వతరగతి నుంచే సబ్జెక్టు టీచర్లు. ఇంగ్లీష్ మీడియంతో మొదలుపెడితే ఐబీదాకా ప్రయాణం. 

గతంలో ఎప్పుడూ చూడని విధంగా మన పిల్లల చేతుల్లో బైలింగువల్ టెక్ట్స్ బుక్స్ అంటే ఒక పేజీ ఇంగ్లిషు మరో పేజీ తెలుగు. బడులు తెరిచేసరికే పిల్లలకు విద్యాకానుక, బడులలో పిల్లలకు గోరుముద్ద, పిల్లలను బడులకు పంపిస్తే చాలు, ఆ తల్లులను ప్రోత్సహిస్తూ ఆ తల్లులకు ఓ అమ్మఒడి. మొట్టమొదటిసారిగా పెద్ద చదువులకు ఏల్లి,తండ్రీ అప్పులపాలు కాకూడదు అని.. ఇంజనీరింగ్‌, మెడిసిన్, డిగ్రీలు చదువుతున్న 93 శాతం మంది పిల్లలకు పూర్తి ఖర్చులు భరిస్తూ విద్యాదీవెన, వసతిదీవెన అందిస్తూ ఆదుకుంటున్నాం. నా అక్కచెల్లెమ్మల కుటుంబాలకు తోడుగా ఉన్నాం. 

గతంలో ఎప్పుడూ జరగని విధంగా...
మన పిల్లలు చదివే డిగ్రీ కోర్సులకు ఇంటర్నేషనల్ యూనివర్సిటీల ఆన్‌లైన్‌ సర్టిఫికేషన్‌ కోర్సులను  మన డిగ్రీలతో అనుసంధానం చేస్తున్నాం. మన డిగ్రీలలో ఇంటర్న్‌ షిప్‌ తప్పనిసరి చేశాం. ఇంతగా పిల్లల చదువుల మీద ధ్యాస పెట్టిన పరిస్థితులు గతంలో ఎప్పుడైనా జరిగాయా?

అక్కచెల్లెమ్మల సాధికారత, స్వావలంబన దిశగా..
నా అక్కచెల్లెమ్మలు ఎలా ఉన్నారు, వారి బ్రతుకులు ఎలా ఉన్నాయి? వారు కూడా వాళ్ల కాళ్ల మీద నిలబడాలి, వాళ్లు కూడా నెలకు అంతో ఇంతో సంపాదించే పరిస్థితి రావాలి, వారికీ స్వావలంబన రావాలి, వారికీ సాధికారత రావాలి అని...ఆ అక్కచెల్లెమ్మల కోసం ఒక ఆసరా, ఒక సున్నా వడ్డీ, ఓ చేయూత, ఓ కాపునేస్తం, ఓ ఈబీసీ నేస్తం...నా అక్కచెల్లెమ్మల పేరిటే 31 లక్షల ఇళ్ల పట్టాలు వారి పేరిటే రిజిస్ట్రేషన్...అందులో నిర్మాణం అవుతున్న 22 లక్షల ఇళ్లు. నా అక్కచెల్లెమ్మల కోసం మీ బిడ్డ చెప్పిన ఈ పథకాలు గతంలో ఎప్పుడైనా ఉన్నాయా?

మొట్టమొదటిసారిగా అవ్వాతాతలకు ఇంటివద్దకే రూ.3వేలు పెన్షన్, ఇంటివద్దకే రేషన్, ఇంటివద్దకే పౌరసేవలు, ఇంటి వద్దకే పథకాలు... ఇలా నేరుగా ఇంటికే పెన్షన్ రావడం, ఇంటి వద్దకే రేషన్, పౌరసేవలు, పథకాలు వంటివి గతంలో ఎప్పుడైనా జరిగాయా ? గతంలో ఎప్పుడూనా చూసారా?

మొట్టమొదటిసారిగా రైతన్నలకు పెట్టుబడి కోసం సాయంగా రైతన్నకు రైతు భరోసా, రైతన్నలకు ఉచిత పంటల బీమా, సీజన్‌ ముగిసేలోగానే రైతన్నలకు  ఇన్ పుట్ సబ్సిడీ,పగటిపూటే 9 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్, ఎప్పుడూ చూడని విధంగా గ్రామస్ధాయిలోనే విత్తనం నుంచి పంట వరకూ  రైతన్నను చేయిపట్టుకుని నడిపిస్తూ ఒక ఆర్బీకే వ్యవస్ధ.. రైతన్నలకు ఇన్ని పథకాలు తీసుకువచ్చి చేయిపట్టి నడిపించే కార్యక్రమం గతంలో జరిగిందా?

గతంలో ఎప్పుడూ జరగని విధంగా...స్వయం ఉపాధికి తోడుగా ఉంటూ...అండగా ఉంటూ...  ఆటోలు, టాక్సీలు నడిపుకుంటున్న నా డ్రైవర్ అన్నదమ్ములకు తోడుగా వాహనమిత్ర, నేతన్నలకు నేతన్ననేస్తం, మత్స్యకారులు మత్స్యకార భరోసా.
పుట్ పాత్‌ల మీద చిన్నచిన్న వ్యాపారాలు చేసుకుంటున్నారు. కొంతమంది టీలు అమ్ముతున్నారు, కొంత మంది ఇడ్లీలు వేస్తున్నారు, కొంతమంది కూరగాయలు అమ్మతున్నావారు, గతంలో ఎప్పుడూనా వీరిగురించి ఎవరైనా పట్టించుకున్నారా? వారికి అండగా ఓ తోడు. నాయీ బ్రాహ్మణులకు, రజకులుకు, టైలర్లకు ఓ చేదోడు. లాయర్లకు కూడా లా నేస్తం. స్వయం ఉపాధికి ఇలా ఇన్నిన్ని పథకాలు గతంలో ఎప్పుడైనా ఉన్నాయా? 

ఆరోగ్యం కోసం పేదవాడు అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదని..
ఏ పేదవాడు కూడా వైద్యంకోసం అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదు... ఏ పేదవాడికైనా వైద్యం ఓ హక్కుగా అందాలి అని.. ఉచితంగా ఏకంగా రూ.25 లక్షల వరకూ విస్తరించిన  ఆరోగ్యశ్రీ. ఆపరేషన్ తర్వాత కూడా పేదవాడు ఇబ్బంది పడకూడదని రెస్ట్ పీరియడ్‌లో కూడా ఆరోగ్య ఆసరా, గ్రామంలోనే పేదవాడికి అండగా విలేజ్ క్లినిక్, గ్రామానికే వచ్చే ఫ్యామిలీ డాక్టర్, పేదవాడి ఇంటికి వచ్చి, ప్రతి ఇల్లూ జల్లెడ పడుతూ...అక్కా బావున్నావా...అన్నా బావున్నావా అంటూ... టెస్టులు చేసి, మందులు ఇచ్చే ఒక ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం. ఈ పథకాలు కానీ, ఈ కార్యక్రమాలు కానీ గతంలో ఎప్పుడైనా జరిగాయా?

ఈ రోజు ఏ గ్రామానికి వెళ్లినా ఆ గ్రామంలో 600 రకాల సేవలందిస్తున్న గ్రామ సచివాలయం కనిపిస్తుంది. అదే గ్రామంలో 60-70 ఇళ్లకు ఇంటికే వచ్చి సేవలందించే వాలంటీర్ వ్యవస్థ... ఆ పక్కనే నాలుగు అడుగులు వేస్తే... అదే గ్రామంలో రైతన్నను చేయిపట్టుకుని నడిపిస్తూ ఆర్బీకే వ్యవస్థ, దానికి పక్కనే ఓ విలేజ్ క్లినిక్, మరో నాలుగు అడుగులు వేస్తే నాడు నేడుతో బాగుపడ్డ ఓ ఇంగ్లిషు మీడియం స్కూలు, అదే గ్రామంలోనే ఫైబర్ గ్రిడ్, నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు, అదే గ్రామంలో నా అక్కచెల్లెమ్మల రక్షణ కోసం గ్రామంలోనే ఒక మహిళా పోలీస్‌. నా అక్కచెల్లెమ్మలు ఎక్కడకు వెళ్లినా ఇబ్బంది పడకూడుదు అని వారి ఫోన్‌లో ఒక దిశ యాప్. నా అక్కచెల్లెమ్మ ఏ ఆపద వచ్చినా ఆ పోన్‌లో దిశా యాప్ బటన్ నొక్కినా లేదా ఫోన్‌ను ఐదుసార్లు షేక్ చేసినా.... పదినిమిషాల్లో పోలీసు సోదరుడు వచ్చి చెల్లెమ్మా ఏం అయింది అని అడుగుతున్న పరిస్థితి. ఇవన్నీ గతంలో ఎప్పుడైనా ఉన్నాయా? ఇవన్నీ ఈ 59 నెలల కాలంలోనే మీ బిడ్డ పాలనలోనే జరిగాయి. 

14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు పేరు చెబితే ఏ పేదకైనా ఆయన చేసిన ఒక్క మంచి కానీ, ఒక్క పథకం కానీ గుర్తుఉందా? అధికారంలోకి వచ్చే దాక చంద్రబాబువి అబద్ధాలు, మోసాలు. అధికారం దక్కితే చంద్రబాబు చేసే మాయలు , మోసాలు ఒక్కసారి ఎలా ఉంటాయో ఒక్కసారి (టీడీపీ మేనిఫెస్టో చూపిస్తూ) చూద్దాం. 2014లో ఇదే పెద్దమనిషి చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో ముఖ్యమైన హామీలంటూ చెప్పినవి.. ఈ ముగ్గురి ఫొటోలు పెట్టి, ఆయన స్వయంగా సంతకం పెట్టి, ఈ పాంప్లెట్‌లో ముఖ్యమైన హామీలు అంటూ మీ ప్రతి ఇంటికీ పంపించాడు.ఈ పాంప్లెట్‌లో హామీలను నమ్మి చంద్రబాబుకు ఓటువేసి, ముఖ్యమంత్రిని చేసారు. ఆ తర్వాత 5 సం.లు చంద్రబాబునాయుడు పరిపాలన చేసాడు. ఇందులో చెప్పినవి ఒక్కటంటే ఒక్కటైనా చేసాడా అని మిమ్మల్నే అడుగుతున్నాను...

చంద్రబాబు విఫలహామీలు.
మొదటిది...రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు. రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాలు మాఫీ జరిగిందా? 
ఇందులో రెండో హామీ...పొదుపు సంఘాల రుణాలను రద్దు చేస్తానన్నాడు. అక్కా, చెల్లెమ్మా పొదుపు సంఘాల రుణాలు రద్దు చేస్తానన్నాడు. రూ.14,205 కోట్ల డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు సంబంధించిన రుణాలు ఒక్క రూపాయి అయినా మాపీ చేశాడా? 
మూడో హామీ....ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద రూ.25వేలు బ్యాంకులో వేస్తామన్నారు.  నేను అడుగుతున్నాను. ఇన్ని వేల మంది ఇక్కడున్నారు. ఏ ఒక్కరికైనా ఒక్కరూపాయి అయినా వేసాడా?
నాలుగో హామీ...ఇంటింటికీ ఉద్యోగం, ఉద్యోగం ఇవ్వలేకపోతే నెలకు రూ.2వేలు నిరుద్యోగ భృతి అన్నాడు. చంద్రబాబు పరిపాలన చేసిన 5 సంవత్సరాలు... 5 సంవత్సరాలు ఆయన పరిపాలన చేసాడు. అంటే 60 నెలలు, అంటే రూ.1.20 లక్షలు ఇచ్చాడా ? ఇన్నివేల మంది ఇక్కడ ఉన్నారు. మీలో ఏ ఒక్కరికైనా ఇచ్చాడా? 
అర్హులందరికీ మూడు సెంట్లు స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇళ్లు అన్నాడు..నేను అడుగుతున్నాను. ఇన్ని వేలమంది ఇక్కడున్నారు. మూడు సెంట్లు స్థలం కథ దేవుడెరుగు, ఒక్కరికైనా కనీసం ఒక్క సెంటు స్థలమైనా ఇచ్చాడా? 
రూ.10 వేల కోట్లతో బీసీ సబ్ ప్లాన్, చేనేత పవర్ లూమ్స్ రుణాలుమాపీ అన్నాడు. జరిగాయా?
ఉమెన్ ప్రొటెక్షన్ పూర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు. చేశాడా ?
సింగపూర్ ని మించి అభివృద్ధి చేస్తామన్నారు, జరిగిందా? ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ అన్నాడు, జరిగిందా? మన పిఠాపురంలో కనిపిస్తోందా? ముఖ్యమైన హామీలంటూ 2014లో స్వయంగా సంతకంపెట్టి, ఇదే ముగ్గురితో కూటమిగా ఏర్పడి, ఇదే ముగ్గురి ఫొటోలు పెట్టుకుని ప్రతి ఇంటికీ పంపించిన ఈ పాంప్లెట్‌ పంపించి, మనతో ఓట్లు వేయించుకుని, ఐదేళ్లు పరిపాలన చేసిన తర్వాత ఇందులో కనీసం ఒక్కటంటే ఒక్కటైనా జరిగిందా?
పోనీ ప్రత్యేక హోదా ఇచ్చాడా? దాన్ని అమ్మేశారు. మరి ఇలాంటి వాళ్లను నమ్మొచ్చా? ఈరోజు మళ్లీ ఏమంటున్నారు? సూపర్ సిక్స్ అంటున్నారు నమ్ముతారా? సూపర్ సెవెన్ అంటున్నారు నమ్ముతారా? ఇంటింటికీ కేజీ బంగారం అంట.. నమ్ముతారా? ఇంటింటికీ బెంజికార్ అంట...నమ్ముతారా? అందరినీ ఆలోచన చేయమని కోరుతున్నాను.

 
అవ్వాతాతలను అగచాట్లకు గురిచేసిన చంద్రబాబు.
జరుగుతున్న ఈ అబద్ధాలు, ఈ మోసాలు, ఈ కుట్రలు చూస్తున్నారు. ఇందులో నిజంగా ఈ మధ్యకాలంలో అత్యంత హేయంగా జరుగుతున్న కుట్రలు చూస్తుంటే వీళ్లు మనుషులేనా అనిపిస్తోంది. 
ఐదేళ్లకు మీ బిడ్డకు అధికారం ఇచ్చారు. మీ బిడ్డ పరిపాలన 60 నెలలు జరగాలి. అలాంటిది 57 నెలలకే మీ బిడ్డ అధికారాన్ని గొంతు నొక్కేసి, ఢిల్లీ నుంచి వాళ్లకున్న రికమండేషన్లు, అధికారంతో మొన్నటి వరకూ అవ్వా తాతలకు ఇంటికొచ్చి ఇచ్చిన పెన్షన్‌ను వీళ్లు దగ్గర ఉండి...వాలంటీర్లు వాళ్ల ఇంటికి వెళ్లకూడదు అని దారుణంగా ఆపించారు. ఆ అవ్వాతాతలు రోడ్డున పడి, ఎండలో తిరిగి, అలిసిపోయి కష్టపడి, అగాచాట్లు పడుతుంటే చంద్రబాబుకు, తన కూటమికి ఎంత శాడిష్టిక్‌ ప్లెజర్ ఇది అని అడుగుతున్నాను. ఇదే కుట్రలు ఇంకా కొనసాగుతూ... మీ బిడ్డ 60 నెలల పాలన పూర్తి కాకమునుపే 57 నెలలకే మీ బిడ్డ గొంతు నొక్కుతున్నారు. 

నా అక్కచెల్లెమ్మలు, అవ్వాతాతలు, పిల్లల గొంతు నొక్కుతున్నారు.
మీ బిడ్డ నా అక్కచెల్లెమ్మల కోసం, నా పిల్లల కోసం, నా రైతన్నలకోసం బటన్లునొక్కాడు. వాళ్లందరికీ మంచి చేయడం కోసం బటన్లు నొక్కాడు. అవి ఎన్నికలకోసం మాత్రమే నొక్కిన బటన్లు కాదు. మొట్టమొదటి రోజు నుంచి ప్రతి సంవత్సరం నా అక్కచెల్లెమ్మలకోసం, నా పిల్లల కోసం, నా రైతన్నల కోసం బటన్లు నొక్కుతూనే ఉన్నాడు. అలాంటి రొటీన్‌గా జరుగుతున్న కార్యక్రమాన్ని 57 నెలలకే ఆపి, నా గొంతు నొక్కుతున్నారు. నా అక్కచెల్లెమ్మలకు నొక్కిన బటన్లను ఆపారు. నా పిల్లల కోసం నొక్కిన బటన్లను ఆపారు. నా రైతన్నలకోసం నొక్కిన బటన్లను ఆపారు. ఆపి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇస్తారట..
నేను అడుగుతున్న మీ బిడ్డ గొంతునొక్కుతున్నారని అనుకుంటున్నారు...
కానీ వాళ్లు నొక్కేది మీ బిడ్డ గొంతు కాదు...వాళ్లు నొక్కుతున్నది....నా అక్కచెల్లెమ్మల గొంతు నొక్కుతున్నారు,,నా పిల్లల గొంతు నొక్కుతున్నారు...నా రైతన్నల గొంతు నొక్కుతున్నారు. ఇవన్నీ ఎవరు చేసింది? ఇదే కూటమి...ఢిల్లీ నుంచి ఎన్నికల కమిషన్‌ దాకా..వీళ్లకు ఉన్న పలుకుబడి ఏ స్థాయిలో ఉంది అంటే...గొంతునొక్కే కార్యక్రమం చేస్తున్నారు. 

ఫర్వాలేదబ్బా..ఫర్వాలేదు...ఎన్నికల అయిపోయిన తర్వాత ఇచ్చినా పర్వాలేదు. దీనివల్ల జగన్‌కు తగిలే దెబ్బ ఏమీ లేదు. ఎందుకంటే జగన్ ఎలాంటివాడో ప్రతి సంవత్సరం నా అక్కచెల్లెమ్మలు చూస్తున్నారు. ప్రతి నెలా నా అవ్వాతాతలు చూస్తున్నాడు. ప్రతి సంవత్సరం నా పిల్లాడూ చూస్తున్నాడు. ప్రతి సంవత్సరం నా రైతన్న చూస్తున్నాడు జగన్‌ ఎలాంటివాడో.. జగన్‌ తప్పు చేయలేదు. జగన్‌ బటన్లు నొక్కాడు. కానీ 60 నెలలు సాగాల్సిన పాలనను 57 నెలలకే జగన్‌ గొంతునొక్కుతూ, జగన్‌ను ఇబ్బంది పెట్టాలని వీళ్లు పథకాలు ఆపుతున్నారు. 

దుష్ప్రచారాలు చేస్తున్న వీళ్లు మనుషులేనా?
అంతటితో ఆగిపోవడం లేదు ఈ కుట్రలు. ఈ మధ్య ల్యాండ్‌ టైటిలింగ్ యాక్ట్‌ మీద రిజిస్ట్రేషన్ల మీద కూడా విపరీతమైన వక్రభాష్యాలు చెబుతున్నారు. విపరీతమైన అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలో రిజిస్ట్రేషన్లు చేసుకున్నవాళ్లు 9లక్షల మంది ఉన్నారు. ఈ మధ్యకాలంలోనే ఇదే దత్తపుత్రుడు మంగళగిరిలో భూములు కొన్నాడు. చంద్రబాబు వియ్యంకుడు బాలకృష్ణ మొన్ననే విశాఖపట్నం రుషికొండలో భూములు కొన్నాడు. వీళ్లను అడుగుతున్నా....మీరు భూములు కొన్నారు కదా...మీరు కొన్నతర్వాత, రిజిష్ట్రేషన్‌ చేసుకున్న తర్వాత మీకు ఒరిజనల్‌ రిజిష్టర్డ్ డీడ్‌ ఇచ్చారా లేక జెరాక్స్‌కాపీ ఇచ్చారా? అని అడుగుతున్నాను. మరి మనరాష్ట్రంలో ఏకంగా 9 లక్షమంది రిజిస్ట్రేషన్‌ చేసుకున్న వాళ్లకు ఒరిజినల్‌ రిజిస్ట్రేషన్‌ డీడ్‌ ఇస్తే జెరాక్స్‌ కాపీలు ఇస్తున్నారు అని, వాళ్ల భూములు జగన్‌ కొట్టేయాలనుకుంటున్నాడు అని ,జగన్ కొట్టేస్తున్నాడు అని ఇంతటి దారుణంగా దుష్ప్రచాలు చేస్తున్నారు అంటే వీళ్లంతా మనుషులేనా అని అడుగుతున్నాను.

పిఠాపురం గురించి మాట్లాడుదాం...
ఈ విషయాలు కూడా మీ అందరికీ చెబుతూ.. ఇక పిఠాపురం గురించి మాట్లాడదాం. ఇక్కడ పోటీ చేస్తున్న ఈ దత్తపుత్రుడికి ఓటు ఎందుకు వేయకూడదో మీ బిడ్డ మీ జగన్ చెబుతాడు మిమ్మల్ని కూడా ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాడు మీ బిడ్డ. 2014లో ఇదే చంద్రబాబు ఇంతకుముందే నేను చెప్పాను. 2014లో ఇదే చంద్రబాబు మోసాల గురించి (టీడీపీ మేనిఫెస్టో చూపిస్తూ). ఇదే చంద్రబాబు మోసాలను నమ్మి రైతులు ఏ రకంగా నష్టపోయారు.. అక్కచెల్లెమ్మలు ఏరకంగా నష్టపోయారు.. పిల్లలు ఏరకంగా నష్టపోయారు.. అవ్వాతాతలు ఏరకంగా నష్టపోయారని చూపించా. నేను అడుగుతున్నాను. 2014లో ఇదే చంద్రబాబు, ఇదే దత్తపుత్రుడు, ఇదే బీజేపీ, ఇదే ముగ్గురి కూటమిగా ఉన్నప్పుడు మరి చంద్రబాబు నాయుడు హత్య చేస్తే ఆ హత్యలో భాగంగా ఆ కత్తి చంద్రబాబు నాయుడికి అందించిన వీళ్లకు కూడా భాగస్వామ్యం లేదా? అని అడుగుతున్నాను. మరి ఇలాంటి వ్యక్తికి ఓటు వేస్తే ఎవరికి మంచి జరుగుతుంది అని ఆలోచన చేయమని అడుగుతున్నాను. ఇప్పుడు కూడా సాధ్యం కాని హామీలతో చంద్రబాబు మేనిఫెస్టో ఇచ్చాడు. అది సాధ్యం కాదు అన్న సంగతి అందరికీ తెలుసు. మీ బిడ్డ ఎంతో కష్టపడితే గతంలో ఎప్పుడూ జరగనివిధంగా పాలన చేస్తే.. గతంలో ఎప్పుడూ చూడనివిధంగా పథకాలు ఇస్తే మీ బిడ్డ ప్రతి ఏటా రూ.70 వేల కోట్లు ఖర్చు చేస్తుంటే ఈరోజు చంద్రబాబు నాయుడు ఇచ్చిన మేనిఫెస్టో ఆయన హామీలను ప్రతి ఏటా ఏకంగా లక్షా 5 వేల రూపాయలు ప్రతి ఏటా ఇస్తాను అని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో చెబుతున్నాడు. 

అందులో ఇదే చంద్రబాబు ఫొటో, ఇదే దత్తపుత్రుడి ఫొటో మరి సాధ్యం కాదని తెలుసు, అబద్ధాలు చెప్తున్నారని తెలుసు. ఎన్నికలు అయిపోయిన తర్వాత పొరపాటున గెలిస్తే మోసం చేస్తారని కూడా తెలుసు. తెలిసి తెలిసి మళ్లీ అదే చంద్రబాబుకు కత్తి ఇచ్చి మళ్లీ రైతన్నలను పొడవండి, పిల్లలను పొడవండి, అక్కచెల్లెమ్మలను పొడవండి, అవ్వాతాతలను పొడవండి అని చెప్పి మళ్లీ కత్తి ఇస్తున్నాడు అంటే ఈ మనిషి రేపొద్దున ఎమ్మెల్యేగా అయితే ఎవరికి న్యాయం చేస్తాడు? ఎవరికి మేలు చేస్తాడు? అన్నది ఒక్కసారి అందరూ కూడా ఆలోచన చేయమని కోరుతున్నాను. 

ప్రతి ఒక్కరినీ కూడా ఆలోచన చేయమని అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడును ప్రతి ఒక్కరినీ కూడా ఆలోచన చేయమని అడుగుతున్నాను. ఇదే దత్తపుత్రుడి గురించి మాట్లాడుతూ. మహిళలు ఈయనను నమ్మే పరిస్థితి ఉంటుందా? అని అడుగుతున్నాను. నా అక్కచెల్లెమ్మలు ఈ దత్తపుత్రుడిని నమ్మే పరిస్థితి ఉంటుందా? అని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నాను. ఐదేళ్లకొకసారి కార్లు మార్చినట్టుగా భార్యలను మార్చే ఈ మనిషి గురించి అందరూ ఆలోచన చేయమని కోరుతున్నాను. ప్రతి ఒక్కరినీ ఆలోచన చేయమని కోరుతున్నాను. ఒకసారి జరిగితే పొరపాటు, రెండోసారి జరిగితే గ్రహపాటు, మరి అదే మూడోసారి, నాలుగోసారి అంటే అది అలవాటు కాదా? అని అడుగుతున్నా. మరి ఇలాంటి వ్యక్తి రేపొద్దున ఎమ్మెల్యే అయితే ఏ అక్కచెల్లెమ్మయినా కూడా పనికోసమేదైనా ఈ దత్తపుత్రుడ్ని కలవడానికి కుదిరే పరిస్థితి ఉంటుందా? అని అడుగుతున్నాను. ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతున్నాను. ఇలాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తి దగ్గరికి ఎవరైనా పోయి పని అడగగలుగుతారా అన్నది ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. 

ఇంకొక విషయం కూడా చెబుతున్న ఈ దత్తపుత్రుడి గురించి. అందరినీ ఆలోచన చేయమని కూడా కోరుతున్నా. అసలు ఈ పెద్దమనిషి ఈ దత్తపుత్రుడికి ఈ మనిషికి ఓటు వేస్తే పిఠాపురంలో ఈ పెద్దమనిషి ఉంటాడా? అని అడుగుతున్నాను. ఈ దత్తపుత్రుడికి మొన్న ఈమధ్యకాలంలోనే జలుబు చేస్తే హైదరాబాద్‌కు వెళ్లిపోయాడు. ఈ పెద్దమనిషికి ఇప్పటికే గాజువాక అయిపోయింది.. ఇప్పటికే భీమవరం అయిపోయింది.. ఇప్పుడు పిఠాపురం ఆలోచన చేయమని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. ఇలాంటి వ్యక్తికి ఓటేస్తే మీకు నిజంగా న్యాయం జరుగుతుందా? అని చెప్పి ఆలోచన చేయమని అడుగుతున్నాను. 

గీతమ్మ నా తల్లిలాంటిది- గెలిపిస్తే డిప్యూటీ సీఎంను చేస్తా..
మరోపక్క నా తల్లి ఇక్కడ ఉంది (వంగా గీతను చూపిస్తూ) నా తల్లి లాంటిది, నా అక్క లాంటిది. మీ అందరికీ చెబుతున్నా బ్రహ్మాండమైన మెజార్టీతో నా అక్కను, నా తల్లిని గెలిపించండి. మీ అందరికీ మీ బిడ్డ మాటిస్తున్నాడు. నా అక్కను డిప్యూటీ సీఎంగా చేసి ఈ పిఠాపురానికి పంపిస్తానని చెబుతున్నా. మీకోసం పంపిస్తా. మీ అభివృద్ధి కోసం పంపిస్తా. మీకు మంచి చేయడం కోసం పంపిస్తా. అక్కను గెలిపించండి మీబిడ్డ మాటిస్తున్నాడు నాపక్కనే డిప్యూటీ సీఎంగా పెట్టుకుని మీ అందరికీ మంచి చేయిస్తాడు మీబిడ్డ అని చెప్తున్నాడు. 

చివరగా మీ అందరికీ కూడా ఒక్కటే ఒకమాట చెబుతున్నాను. అందరినీ ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. చంద్రబాబు ప్రలోభాలకు మోసపోవద్దండి అని మీ అందరికీ కూడా చెబుతున్నాను. ఐదేళ్లు మీ బిడ్డ పాలన చూశారు. ప్రతి సంవత్సరం మీకు క్యాలెండర్ ఇచ్చాడు మీ బిడ్డ. ఏ నెలలో రైతుభరోసా ఇస్తాను, ఏ నెలలో అమ్మఒడి ఇస్తాను, ఏ నెలలో చేయూత ఇస్తాను అని మీ బిడ్డ చెప్పి క్యాలెండర్ ఇచ్చి క్రమం తప్పకుండా కూడా ప్రతి సంవత్సరం మీ బిడ్డ ఇచ్చుకుంటూ వచ్చాడు. చంద్రబాబు ప్రలోభాలకు మోసపోయి ప్రతి సంవత్సరం ఆ తర్వాత జరగబోయే మంచికి ప్రతి ఐదేళ్లు కూడా జరిగే ఆ మంచిని ఏ ఒక్కరూ కూడా పోగొట్టుకోవద్దండీ అని చెప్పి మీ అందరితో కూడా ఈరోజు మీబిడ్డ విజ్ఞప్తి చేస్తున్నాడు.

పేదవాడి భవిష్యత్ కోసం- ఫ్యాను గుర్తుపై ఓటేయండి.
వాలంటీర్లు మళ్లీ ఇంటికే రావాలన్నా, అవ్వాతాతల పెన్షన్ ఇంటికే అందాలన్నా... నొక్కిన బటన్ల డబ్బులు మళ్లీ నా అక్కచెల్లెమ్మల కుటుంబాలకు రావాలన్నా, పేదవాడి భవిష్యత్ మారాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, మన బడులు, మన చదువులు బాగుపడాలన్నా, మన వైద్యం, మన వ్యవసాయం మెరుగుపడాలన్నా.. ఇవన్నీ జరగాలంటే ఫ్యాను గుర్తు మీద రెండు బటన్లు నొక్కాలి. నొక్కి 175కి 175 అసెంబ్లీ స్ధానాలు, 25కి 25 ఎంపీ స్ధానాలు ఒక్కటి కూడా తగ్గేందుకే వీలే లేదు. సిద్ధమేనా? సిద్ధమేనా? అక్కా సిద్ధమేనా?.

ఇక్కడో అక్కడో ఎక్కడో మన గుర్తు తెలియని వాళ్లు ఎవరైనా ఉంటే.. అన్నా మన గుర్తు ఫ్యాను. తమ్ముడూ మన గుర్తు ఫ్యాను, అక్కా మన గుర్తు ఫ్యాను, పెద్దమ్మలు, అవ్వలు మన గుర్తు ఫ్యాన్, చెల్లమ్మా మన గుర్తు ఫ్యాన్, అన్నా మన గుర్తు ఫ్యాన్ అక్కా, అక్కడున్న అక్కలు చెల్లెమ్మలు అవ్వలు పెద్దమ్మలు ఫ్యాన్ అమ్మా, ఇక్కడున్న చెల్లెమ్మలు అక్కలు అన్నలు ఫ్యాన్ అన్న, ఫ్యాన్ అక్కా, ఫ్యాన్ తల్లి.. మంచి చేసిన ఈ ఫ్యాను ఎక్కడ ఉండాలి? ఇంట్లోనే ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి? ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ ఎక్కడ ఉండాలి? సింక్‌లోనే ఉండాలి. 

ఇవన్నీ కూడా మీ అందరికీ చెబుతూ.. నా అక్క నా తల్లిలాంటిది గీతమ్మ ఇక్కడ ఉంది. మీ అందరికీ కూడా చెబుతున్నాను. గీతమ్మను ఆశీర్వదించండి. అమ్మను ఆశీర్వదించండి. మీ అందరికీ కూడా మంచి చేయిస్తానని చెప్పి మరొక్కసారి మీ అందరికీ కూడా చెబుతూ మీ బిడ్డ రెండు చేతులు జోడించి పేరుపేరున ప్రార్థిస్తున్నాడు. ఎంపీ అభ్యర్ధిగా సునీల్ ఉన్నాడు. యువకుడు, ఉత్సాహవంతుడు. మీ అందరికీ కూడా మంచి చేస్తాడు. మీ చల్లని దీవెనలు ఆశీస్సులు కూడా సునీల్‌పై ఉంచాల్సిందిగా సవినయంగా మీబిడ్డ రెండు చేతులు జోడించి పేరుపేరునా ప్రార్థిస్తున్నాడు అంటూ ముఖ్యమంత్రి  .వైయస్ జగన్ తన ప్రసంగాన్ని ముగించారు.  

Back to Top