సైకో సైకిల్

సైకోలెవరో తెలియాలంటే చంద్రబాబు తమ పార్టీ నేతలందరినీ అద్దంలో చూసుకోమంటే సరిపోయేది. ఆయనే స్వయంగా ఆపనిచేసనా భేషుగ్గా ఉండేది. ఎందుకంటే ఆ పేరుకు కరెక్టుగా సూటయ్యేది తెలుగుదేశం నేతలు తప్ప మరేపార్టీ నాయకులూ కాదు. 
పాతికకు పైగా కేసుల్లో తలమునకలై ఉన్నవాడు, లేడీ అధికారులను జుట్టుపట్టుకుని మట్టిలోకి ఈడ్చినవాడు, విచారణకు పిలిచిన అధికారులనే బూతులు తిట్టేవాడూ సైకో అవుతాడు కానీ అధికారపక్షం అవినీతిని బయటపెట్టిని వాళ్లు సైకోలు అవుతారా?
ఆడది కనిపిస్తే ముద్దైనా పెట్టాలింకడుపైనా చేయాలి అన్న వాడు సైకో అవుతాడు కానీ అక్కచెల్లెమ్మలకు అండగా ఉంటానిని హామీ ఇచ్చేవారు సైకోలు అవుతారా?
పావలా సాయానికి ముప్పావలా ప్రచారం చేసుకుంటూ, అప్పడాల మీద కూడా అప్పచ్చి ముఖాన్ని ముద్రించి ఓట్ల ముష్టి అడుక్కునేవాళ్లు సైకోలు అవుతారు కానీ, అండగా నేను ఉంటాను, అన్నగా ఆదుకుంటాను అన్నవారు సైకోలు అవుతారా?
ఆడవారి మీద అసభ్యమైన రాతలు రాసేవాళ్లు, వెనకుండి రాయించేవాళ్లూ, కత్తులతో కుత్తుకలు కోసేవాళ్లూ, కోయించేవాళ్లూ, తడిగుడ్డతో గొంతు నులిమేవాళ్లూ, వెన్నంటి ఉండి వెన్ను పోటు పొడిచేవాళ్లూ సైకోలు అవుతారు కానీ అందరికోసం అన్నీ వదిలి, ఎండనక, వాననకా ప్రజలే ప్రధానమనుకున్నవారు సైకోలు అవుతారా?
సైకోలు ఎవరో, సైకోపార్టీ ఎవరిదో రాష్ట్రంలో జరిగే పరిణామాలు చూస్తున్నవారికి సులువుగానే అర్థం అవుతోంది. సైకో సైకిల్ ఐదేళ్లు కిల్ చేసిన ప్రజాస్వామ్యం ఇప్పుడు బాబును చూసి విరగబడి నవ్వుతోంది. 

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top