లోకేష్‌కి క్విజ్‌

తెలుగుదేశం పార్టీ ఆఫీస్‌లో క్విజ్‌ పోటీ పెట్టారు
‘తెలుగు అంటే ఏమిటీ?’ అని లోకేష్‌ని అడిగారు నిర్వాహకులు
‘ తెలుగు అంటే నథింగ్‌ బట్‌ తెలుగు. టెల్‌ అంటే చెప్పండి అని అర్థం. అందువల్ల తెలుగువాళ్లకి ఏదో ఒకటి చెబుతూఉండాలి’ అన్నాడు లోకేష్‌.
‘సూపర్, మీరు తెలుగుదేశానికే సందేశం వంటివారు’ అని మెచ్చుకున్నారు నిర్వాహకులు
‘సార్వభౌమాధికారం అంటే ఏమిటి?’
‘సార్వభౌ..భౌ...భౌ..భౌ.. అంటే అందరూ భౌభౌ అనాలి’
‘ఎందుకని?’
‘ఎందుకంటే పార్టీలో అందరూ విశ్వాసంగా వుండాలంటే భౌమాధికారం తెలియాలి’
‘డబుల్‌ సూపర్‌ జయంతి అంటే ఏంటీ?’
‘జయంతి అంటే మా తాతతో యాక్ట్‌ చేసిన సినిమా యాక్టర్‌’
‘వర్థంతి అంటే?’
‘మా మామ బాలకృష్ణతో యాక్ట్‌ చేసిన హీరోయిన్‌’
‘పార్టీ అంటే?’
‘మనం విదేశాలకి వెళ్లినప్పుడు సరదాగా చేసుకునేది’
‘ప్రజలంటే?’
‘తోటమాలి, డ్రైవర్, కుక్, స్వీపర్‌ వీళ్లందరిని ప్రజలు అంటారు’
‘ప్రభుత్వం అంటే?’
‘డబ్బులు సంపాదించుటకు అదొక సాధనం’
‘మంత్రి అంటే ఎవరు?’
‘వెంట గన్‌మెన్‌లు ఉండే వ్యక్తి’
‘ముఖ్యమంత్రి అనగా?’ 
‘మా నాన్న’
‘ఆయన అర్హత ఏమిటి?’
‘అబద్దాలు చెప్పడం’
‘అమరావతి అనగా?’
‘అదొక ఆంటీ పేరు’
‘సేవ చేయడం అంటే?’
‘మా ఇంట్లో పనివాళ్లు చేయునది’
‘రాజధాని అనగా?’
‘అదొక హోటల్‌’
‘వెన్నుపోటు అంటే?’
‘మా తాతని మా నాన్నపొడిచిన పోటు’
లోకేష్‌కి సెంట్‌ పర్సెంట్‌ మార్కులు వేసి పంపారు.
Back to Top