పవన్ మీద ఒట్టు. అన్నీ నిజాలేఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు చేసింది తప్పని తెలుసు.
అయినా  ఆయన్ని ఏమీ అనకుండా ఎందుకు నిగ్రహంగా ఉన్నారో తెలుసా?
అనుభవజ్ఞుడైన చంద్రబాబును ఏమన్నా అంటే..కురిసే వర్షాలు కురవకుండా ఆగిపోతాయి. పసిపిల్లలు పాలు తాగడం మానేసి గుక్క పెట్టి ఏడుస్తారు.  ప్రజలకోసమే...మౌనంగా ఉండాల్సి వచ్చింది.
..........................
బోటు ప్రమాదంలో అంతమంది  చనిపోవడం  బాధ కలిగించింది.
కాకపోతే.. బోటు ప్రమాదాలను ఆపడానికి   వై.ఎస్.రాజశేఖర రెడ్డి ఏమీ చేయలేదు.
అంచేత ఒంగోలు బోటు ప్రమాద బాధితులంతా వై.ఎస్.ఆర్. ను నిలదీయండి.
కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వకపోవడానికి కూడా వై.ఎస్.రాజశేఖర రెడ్డే కారణం.
ఆయనపై ఎవరూ పోరాడరేం?
...........................
అన్నయ్య చిరంజీవి చాలా మంచి వారు.కానీ స్వార్ధ పరులంతా కలిసి ఆయన పార్టీని గెలవకుండా అడ్డుకున్నారు. అవినీతిలో నిండా మునిగిన కాంగ్రెస్ పార్టీ..అత్యంత దుర్మార్గంగా చిరంజీవిని  పిలిచి ప్రజారాజ్యం పార్టీని విలీనం చేసుకుంది. చిరంజీవి వద్దు వద్దని వారిస్తోన్నా  బలవంతంగా రాజ్యసభ సీటు ఇచ్చింది. అలాగైనా ప్రశాంతంగా ఉండనీయకుండా ఏకంగా పర్యాటక శాఖ మంత్రి పదవినీ అంటగట్టింది.
..............................
పరకాల ప్రభాకర్ వంటి కమిట్ మెంట్ లేని రాజకీయ నాయకుల వల్లే రాజకీయాలు భ్రష్టు పడుతున్నాయి.ఎంతో కమిట్ మెంట్ తో   కాంగ్రెస్  కు వ్యతిరేకంగా పోరాడతామని స్థాపించిన ప్రజారాజ్యం పార్టీని  తీసుకెళ్లి తాము తిట్టిపోసిన కాంగ్రెస్ లో కలపాల్సి వచ్చిందంటే దానికి ప్రభాకరే కారణం.
.............................
చంద్రబాబు కి అనుభవం ఉంది కాబట్టే  2014లో మద్దతు ఇచ్చాం.
జగన్ మోహన్ రెడ్డికి అనుభవం లేదు కాబట్టి ముఖ్యమంత్రి పదవి ఆశించకూడదు.
అన్నయ్య చిరంజీవికి ఎలాంటి అనుభవం లేకపోయినా ముఖ్యమంత్రి పదవిని ఆశించవచ్చు. ఎందుకంటే ఆయన చాలా మంచి వారు. అందరికీ మంచి చేద్దామని అనుకున్నారు  .కాకపోతే ఆయనకు బలం లేదు.
..........................
అసలు రెండో తరగతి చదువుతోన్నప్పుడే.. ఆయన రాజకీయాల్లోకి రావాలని గట్టిగా అనుకున్నారు. అయితే  మరీ అంత చిన్న వయసులో  అనుకున్నామని చెబితే ..అందరూ అసూయ పడతారని పదో తరగతిలో అనుకున్నట్లు చెప్పారు.
..........................
అసలైన విషయం ఏంటంటే... ఆయనకి ఎవరన్నా గుండు కొట్టించారని అనుకుంటున్నావేమో..అలాంటిదేమీ లేదు. తలంతా పేళ్లు పట్టేసి.. ఊరికే దురద పెట్టేస్తోంటే... భరించలేక ఆయన  గుండు కొట్టించుకొందామని సెలూన్ కి వెళ్లారు. తీరా అక్కడ కూర్చున్నాక అన్నయ్య ఫోను చేసి..ఫలానా వాళ్ల అబ్బాయి  నీకు టెంకిజెల్ల కొట్టాడట కదా అని అడిగాడట.
ఏం లోకమో..ఏంటో?

దయచేసి ఆయన్ని అపార్ధం చేసుకోకండి.
ఆయన్ని అలా వదిలేయకండయ్యా బాబూ.
ఎక్కడైనా చూపించండి పాపం.

కవికాకి


 
Back to Top