పిల్ల కాంగ్రెస్ జెల్లకాయ!!కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి కూడా కాంగ్రెస్తో చీకటి లాలూచీ నడిపిని పార్టీని పిల్ల కాంగ్రెస్ అంటారు.
ప్రతిపక్షంలో ఉండి కూడా అధికార కాంగ్రెస్ కు అనుకూలంగా పనిచేసిన పార్టీని పిల్ల కాంగ్రెస్ అంటారు.
తెలుగు తమ్ముణ్ణి తెలంగాణ కాంగ్రెస్ కోటరీలోకి ముందు పంపి, సీట్లు, ఓట్లు, నోట్లు, కేసుల సర్దుబాట్లు బేరం పెట్టుకున్న పార్టీని పిల్ల కాంగ్రెస్ అంటారు.
కాంగ్రెస్ రాష్ట్రాన్ని విభజించి ద్రోహం చేసిందని ఏడుపులు ఏడ్చి, ఇప్పుడదే కాంగ్రెస్ విభజన హామీలు నెరవేరుస్తుందని సిగ్గులేక చెబుతున్న పార్టీని పిల్ల కాంగ్రెస్ అంటారు.
దెయ్యమన్న నోటితోనే దేవతని పొగుడుతున్న వాళ్ల పార్టీనే పిల్లకాంగ్రెస్ అంటారు.
రాహుల్ వస్తే పరుగులు పెట్టిన పారిశ్రామికవేత్తల కుటుంబ పార్టీని పిల్ల కాంగ్రెస్ అంటారు.
చీకట్లో చిదంబరాన్ని కలిసిన నారా పార్టీని పిల్ల కాంగ్రెస్ అంటారు. 
పక్కరాష్ట్రపు ఎన్నికలకు కాంగ్రెస్ తరఫున ప్రచారానికి తన వాళ్లను పంపిన పార్టీని పిల్ల కాంగ్రెస్ అంటారు.
కర్ణాటక ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి వెళ్లి కాంగ్రెస్ నేతలను కౌగిలించుకున్న వాళ్ల పార్టీని పిల్ల కాంగ్రెస్ అంటారు.
సైకిల్ ను తీసుకెళ్లి చేతికందిచిన వాళ్ల పార్టీని పిల్ల కాంగ్రెస్ అంటారు...
అంతేకానీ కాంగ్రెస్ నుంచి బయటకు వస్తేనో...కాంగ్రెస్ పేరు చివర తగిలిస్తేనో ఏ పార్టీ  పిల్ల కాంగ్రెస్ అయిపోదు.
నిజానికి కాంగ్రెస్ నాయకత్వాన్నీ, సోనియా అహంకారాన్ని తొడగొట్టి సవాల్ చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ అసలైన కాంగ్రెస్...పెద్ద కాంగ్రెస్...పౌరుషమున్న కాంగ్రెస్..
 
Back to Top