``కట్టప్ప, బాహుబలిని ఎందుకు పొడిచాడో నాకు తెలుసు`` అన్నాడు చంద్రబాబు విలేకరులంతా ఆశ్చర్యపోయారు. ``జనానికి సినిమా చూపించడమే తప్ప, మీరు సినిమాలు చూస్తారని మాకు తెలియదే, ఇంతకూ కట్టప్ప ఎందుకు చంపాడు..? అని అడిగారు విలేకరులు.``రాజకీయాల్లో అధికారం కోసం సొంతమామనే పొడిచాను నేను, ఇక కట్టప్ప ఎందుకు పొడిచాడు అని మీరంతా ఎందుకు బద్దలు కొట్టుకుంటున్నారు`` అన్నాడు బాబు.``అంటే మీరు కట్టప్పకంటే గ్రేటా..?````గ్రేటెస్ట్.. ఎందుకంటే కట్టప్ప ఒక సేవకుడు, నేను ఇంటల్లుడు, సేవకుడు పొడిస్తే అది కామన్. అల్లుడు పొడిస్తే అది హిస్టరీ````ఆ హిస్టరీ ఇంకోసారి చెప్పండి````చెప్పేదేమీలేదు, రాజకీయాల్లో నమ్మడం. నమ్మించడం, నమ్మకుండా వుండడం ఈ మూడు పద్దతులుంటాయి. ఎన్టీఆర్ నన్ను నమ్మాడు, నేను ఆయన్ని నమ్మించాను. ఆ తరువాత నేనెవర్ని నమ్మకుండావున్నాను. అందకుకే నన్నెవరు పొడవలేదు`` అన్నాడు బాబు. ``ఎవరు దగ్గరికొస్తే, వాళ్లని మీరే పొడుస్తున్నారు. మిమ్మల్ని పొడిచే ఛాన్స్ ఎక్కడిస్తున్నారు.````రేపు నా కుమారుడికి కూడా ఆ అవకాశం ఇవ్వకూడదని అతన్ని మార్ఖునిలా పెంచాను. రాజకీయాల్లో వున్నాడే కానీ ఆంధ్రరాష్ట్రంలో ఎన్ని జిల్లాలున్నాయో కూడా లోకేష్‌కి తెలియదు.````వున్న జిల్లాలన్నీమీరే దోచేసారు. ఇక దోచుకోడానికి ఆయనకి జిల్లాలు ఎక్కడున్నాయి..?````అందుకే కూరగాయల షాపులిచ్చేసాను.````కూరగాయల్లో కూడా ఆయన వందల కోట్లు సంపాదిస్తున్నాడు అదే గ్రేట్````కూరగాయల్లో నాకు బాగా నచ్చేది కరివేపాకు. రాజకీయాల్లో ఎవన్నయినా అలా వాడుకుని ఇలా వదిలేయాలి````ఇంతకూ ఎన్టీఆర్‌ని ఎలా పొడిచారు..?````83లో ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడే కత్తినూరుకున్నాను. అనవసరంగా నాదెండ్ల భాస్కర్‌రావు చెడగొట్టాడు. 85లో ఆయన జోలికి పోలేదు. రంగం సిద్ధం చేసుకున్నాను. 94 తరువాత అవకాశం వచ్చింది. మామకి సినిమా చూపించాను.````కట్టప్పకంటే మీరే గ్రేట్‌సార్. ఆయన ఒకేసారి చంపేసాడు. కానీ మీరు ఎన్టీఆర్‌ని బతికుండగానే చంపేసారు``