ఎదగరా 'పచ్చ'గా...!!

అవును టిడిపి పచ్చగా ఎదగాలనుకుంటోంది. ఎపిలో కాదు లెండి ప్రపంచ వ్యాప్తంగా ఎదగాలని బాబు కోరిక. మహానాడును 100 దేశాల్లో నిర్వహించాలని
కలలు కంటున్నాడు చంద్రబాబు. తెలుగు ప్రజలు ఉన్న చోటల్లా పచ్చ జెండా పాతేయాలన్నది
బాబుగారి చిరకాల వాంఛ. అమెరికా, గల్ఫ్ దేశాల్లో మహానాడులు నిర్వహించిన టిడిపి అధినేత
ప్రపంచ దేశాలన్నిటిలో మహానాడు ఏర్పాటు చేయాలని, 2100కి కూడా రాష్ట్రంలో టిడిపి పాలనే సాగాలని కలలు కంటున్నారు.

కలాం గారన్నట్టు కలలు
కనాలి. అవి కూడా చాలా పెద్దగా కనాలి. బాబు గారు కూడా అలాంటి కలలే కంటున్నారు. కానీ ఆచరణలో అందుకు
తగ్గ ప్రయత్నం మాత్రం ఏదీ చేయరు. ప్రపంచ దేశాల సంగతిపక్కన పెడితే పొరుగు
రాష్ట్రాల్లో ఏనాడూ బాబుగారు మహానాడు నిర్వహించిన పాపాన పోలేదు. అంతెందుకు తాను చెప్పినందువల్లే
కర్ణాటకలో తెలుగువాళ్లంతా బిజెపికి ఓట్లు వేయలేదని గొప్పలు పోయిన బాబు, ఆ రాష్ట్రంలో పోటీ ఎందుకు
చేయలేదంటే నోరు విప్పడు.

ఇక తెలుగు వారు అత్యధికంగా
ఉండే ముంబయి, మహారాష్ట్రలోనూ బాబు ఏ విధంగానూ ముందుకు పోలేదు. పొరుగునున్న తమిళనాడు, కేరళాల్లోనూ బాబు భజన
నాడును పెట్టేలేకపోయారు. దేశమంతా తెలిసిన నేత, టెక్నాలజీకి పితామహుడు, దేశంలోనే సీనియర్ రాజకీయవేత్త, జాతీయ రాజకీయాల్లో చక్రం
తిప్పిన వాడు అనే కీర్తి కిరీటాలు తగిలించుకుని తిరిగే బాబు పొరుగు రాష్ట్రాల్లో ఎందుకు
మహానాడు ఏర్పాటు చేయలేకపోతున్నాడని మనబోటివాళ్లెవరైనా ప్రశ్నిస్తే తెలుగు తమ్ముళ్లకు
కోపం వస్తుంది.  

నాన్నను మించిన వాడు
నారా లోకేషు బాబు. వందదేశాల్లో మహానాడు అని చంద్రబాబు అంటే అమెరికాలోనూ అధికారంలోకి వద్దామని
అన్నాడు లోకేశం ఈ మధ్య అమెరికాలో జరిగిన టిడిపి అభిమానుల సమావేశంలో. అందుకే అంటున్నారు ఎదగడానికెందుకురా
తొందరా ఎదర పార్టీ బతుకంతా చిందర వందర అని...

Back to Top