’బిసి’కెట్టులొద్దు బాబూ...!!

దొంగ జపం కొంగజపం అంటాం కదా...ఇవాళ రేపూ చంద్రబాబు అది చాలా బాగా చేస్తుంటాడు. అదే బీసీల జపం. చేపల కోసం ఎరలు వాడినట్టు బీసీల మీద ప్రేమ ఒలకబోస్తూ బిస్కెట్లు వేస్తుంటాడు. కార్పొరేషన్ అనే పేరుతో కొత్త బిస్కెట్ సిద్ధం చేసాడు. 
ఎన్నికలు దగ్గర పడ్డాక ఆదరణ అన్నాడు. బిసి డిక్లరేషన్, సంవత్సరానికి పదివేల కోట్ల నిధులు, నామినేటెడ్ పోస్టులు అంటూ 2014లో ఇచ్చిన హామీలే నెరవేరలేదు. బీసీలు జడ్జీలుగా పనికిరారు అంటూ కేంద్రానికి లేఖ రాసాడు. ఒక ఎమ్మార్వోను ట్రాన్స్ ఫర్ చేసే పవర్ కూడా లేని కృష్ణమూర్తి ఉప ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వంలో. పేరుకే బీసీ నేత. కానీ అధికారాలన్నీ బాబు చేతులోనే. కేవలం కీలుబొమ్మ నాయకులను మాత్రమే పదవుల్లో ఉంచి అధికారం చెలాయించే చంద్రబాబు బీసీలను మరోసారి బుట్టలో పెట్టే పనిలో పడ్డాడు.

గతంలో ఇచ్చిన బీసీలకు వంద సీట్లు వ్యవహారం పచ్చి అబద్ధం అని తేలిపోయింది. బీసీలకు రాజకీయ ప్రాధాన్యం అన్నమాట ఉత్తదని అర్థం అయ్యింది. ఆదరణ పథకం అంతా పకడ్బందీ ఎన్నికల స్టంట్ గా మిగిలిపోయింది. 2019 బీసీలు బాబును ఇస్త్రీ పెట్టెతో వాతలు పెట్టేందుకు రెడీగా ఉన్నారు. కార్పొరేషన్లు అన్నా, కార్పస్ ఫండ్ అన్నాబాబు మాటలు నమ్మేవారున్నారా అన్నది డౌటు. బిసి నేత ఆర్.కృష్ణయ్య బాబును నమ్మిన దగ్గర నుండీ ఎప్పుడూ చేతులు కట్టుకోవాల్సిన పరిస్థితిలో ఉండటం బీసీలు గమనిస్తూనే ఉన్నారు. ఇప్పుడిక ఎన్ని బిస్కెట్లు వేసినా బీసీల నుంచి ఓట్లు రాలవని విజనరీ సీఎంకు అర్థమైతే బాగుండు.

రజకులకు ఝlఛి, బోయలకు M్క అంటూ జగన్ ఇచ్చిన హామీలు బీసీల్లోకి దూసుకుపోయాయి. రాజమండ్రి లోక్ సభ స్థానం బిసిలకే అని డిక్లేర్ చేసి మరో అస్త్రం వదిలారు జగన్. ప్రజాసంకల్పయాత్ర సమయంలోనే బీసీల కోసం అధ్యయన కమిటీ వేసారు. రేపు జరగబోయే బిసి గర్జనలో వారికి అందించే పథకాల డిక్లరేషన్ చేయబోతున్నారు. బాబు గూబ గుయ్ మనే ఈ గర్జనతో టిడిపి బిస్కెట్లు ముక్కలవ్వడం ఖాయం అంటున్నారు...

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top