బాబుకు బకరాలు


అవును బాబు అవసరానికి ఎప్పుడూ ఎవరో ఒక బకరా దొరకుతూనే ఉంటారు. బాబు మాయ మాటలు నమ్మో, బాబు వల్ల ఏదో కలిసొస్తుందని ఊహించుకునో చేతులు కలిపి ఆనక చేతులు కాల్చుకుంటారు. వాళ్ల లిస్టేంటో ఒకసారి చూద్దాం. 
దీనిగురించి చెప్పాల్సివచ్చినా ముందు నందమూరి కుటుంబం గురించే చెప్పాలి. 
అల్లుడిలా వచ్చి నమ్మించి ఎన్టీఆర్‍ను వెన్నుపోటు పొడిచాడు.
తోడల్లుడు దగ్గుబాటిని కూరలో కరివేపాకులా వాడి వదిలేసాడు.
బావ హరికృష్ణను తండ్రికి దూరం చేసి ఏకాకికని చేసి దెబ్బేసేసాడు.
సొంత తమ్ముడు పొగపెట్టకుండా ముందే శంకరగిరి మాన్యాలు పట్టించాడు.
జూనియర్ తో ప్రచారం చేయించి ఆ తర్వాత పక్కకు తోసేసాడు. 
బాలకృష్ణతో వియ్యం పెట్టుకుని ఫ్యూచర్ లో కయ్యం లేకుండా సెట్ చేసేసాడు.
ఇప్పుడు తాజాగా ఆ కుటుంబం నుంచి బాబుకు మరో కొత్త ముఖం దొరికింది. 
హరికృష్ణ కూతురు సుహాసిని. 
నందమూరి వంశం అంతా నారావారికి పనికొచ్చే పప్పెట్లు అవ్వడమే ఖర్మం.
ఇక బీజేపీ, టిఆర్ఎస్, వామపక్షాలు, జనసేన లాంటి పార్టీలన్నిటినీ కూడా వాటర్ బాటిల్ లా తాగేసి విసిరేసాడు. 
బాబుకు బలికావడానికి మరో బలిపశువుగా ఇప్పుడు కాంగ్రెస్ కనిపిస్తోంది. 
రేపు 2019 ఎన్నికల్లో ఓడాక కాంగ్రెస్ తో పొత్తు చారిత్రిక తప్పిదం అంటాడు చంద్రబాబు
మహాకూటమి నన్ను మాయ చేసింది అంటాడు.
ఆ మాటకొస్తే దేశం అంతా కలిసి తెలుగుదేశాన్ని దగా చేసింది అంటాడు...
 
 
Back to Top