అన‌గ‌న‌గా ఓ చంద్ర‌న్న‌

అమ‌రావ‌తి న‌గ‌రంలో అన‌గ‌న‌గా ఓ చంద్రన్న అనే నాయ‌కుడు ఉండేవాడు....ఆయ‌న త‌న పేరు నాలుగుదిక్కులా మారు మోగాల‌నుకున్నాడు....అనుకుని ఏం చేసాడ‌య్యా అంటే...

చంద్రన్న బాట ..చంద్రన్న భీమా, చంద్రన్నపోలవరం , చంద్రన్న పట్టిసీమ, చంద్రన్నవెలుగోడు . చంద్రన్న అమరావతి , చంద్రన్న రైల్వే జోన్. చంద్రన్న రైతు భీమా , చంద్రన్న పసుపు కుంకుమ , చంద్రన్న రైతు రుణ మాఫీ, చంద్రన్న డ్వాక్రా  , చంద్రన్న LED , చంద్రన్న సీసీ రోడ్డు , చంద్రన్న దీపం , చంద్రన్న ట్రాక్టర్ , చంద్రన్న బస్సు , చంద్రన్న సైకిలు , చంద్రన్న చెప్పులు , చంద్రన్న తోఫా , చంద్రన్న సోఫా , చంద్రన్న కుర్చీ , చంద్ర‌న్న అప్ప‌డం, చంద్ర‌న్న అప్పులు, చంద్రన్న ఐఐటి, చంద్రన్న గిరిజన యూనివర్సిటీ , చంద్రన్న పెట్రో కాంప్లెక్స్ , చంద్రన్న రిఫైనరీ , చంద్రన్న ఉక్కు ఫ్యాక్టరీ , చంద్రన్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ..చంద్రన్న మరుగు దొడ్డి...చంద్రన్న ఓటరు జాబితా....చంద్రన్న దోపిడీ...చంద్రన్న మట్టి...చంద్రన్న ఇసుక...చంద్ర‌న్న ఓటుకు నోటు....

ఇలా అన్నిచోట్లా త‌న పేరు పెట్టేశాడు. పేరు మాత్ర‌మే పెట్టాడా...ఆ త‌ర్వాత ప‌నులు కూడా ప‌క్క‌న పెట్టేశాడు. పనికిరాని ప‌నుల‌కు బోలెడు డ‌బ్బులూ త‌గ‌లేసాడు. పేరుకోసం పేప‌ర్ల‌కెక్కేశాడు. జ‌నాల సొమ్మును ఖాళీ చేసేసాడు. స్పెష‌ల్ ఫ్లైట్లు ఎక్కేశాడు. రాష్ట్రంలో అందినంతా బొక్కేసాడు. అదేమిట‌ని ఎవ‌రైనా అడిగితే తిత్తితీస్తా అనేశాడు... అప్పుడేమైంది అంటే...
ఈ సుత్తిని మేము భ‌రించ‌లేం బాబోయ్ అంటూ ప్ర‌జ‌లే సుత్తిపెట్టి చంద్ర‌న్న నెత్తిన ఓ మొట్టు మొట్టేశారు...సీటులోంచి దింపి ఓ మూల పెట్టేశారు...

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top